Begin typing your search above and press return to search.
ఫేక్ న్యూస్ నమ్మొదంటున్న మహేష్!
By: Tupaki Desk | 7 April 2020 3:15 PM GMTప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న సమయంలో ప్రజల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించేందుకు సినీ తారలు తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారు. పేదలకు ఆర్థికంగాను, సామాజికంగాను సహాయం చేయడానికి సిద్దమయ్యారు. ప్రతీ రోజు ప్రజలను, అభిమానుల్లో ధైర్యాన్ని నింపుతూ సోషల్ మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో మన దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో వణికిపోతున్నాయి. చైనా నుండి వ్యాప్తి చెందిన ఈ మహమ్మారిని త్వరితగతిన తరిమికొట్టేందుకు ఇప్పటికే పలు దేశాలు తమ తమ ప్రజలను సామజిక దూరం పాటించేలా ఇళ్లకే పరిమితం చేస్తూ లాకౌట్ లు ప్రకటించగా మన దేశాన్ని కూడా 21 రోజలు లాకౌట్ చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. అయితే దీని వలన అట్టడుగు వర్గాల వారు పని లేక, తినడానికి తిండికూడా లేని పరిస్థితులు ఎదురుకావడంతో ప్రభుత్వాలు ముందుకు వచ్చి వారికి ఫ్రీ రేషన్ తో పాటు కొంత మొత్తాన్ని ఆర్ధిక సాయంగా అందిస్తున్నాయి.
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్ కు రూ.50 లక్షల చొప్పున రూ.1 కోటి తో పాటు సినీ రోజువారీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ. 25 లక్షల విరాళం అందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు, కొద్దిరోజులుగా ప్రజలను ఈ మహమ్మారి పట్ల జాగ్రత్త వహించాలని కోరుతూ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పలు పోస్టులు పెట్టారు. వాటి ద్వారా తనకు సాధ్యమైనంత వరకు అవర్నెస్ కలిగిస్తూ వస్తున్నాడు. తాజాగా రెండు వారాల లాక్‌డౌన్ తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబు ట్విట్టర్‌లో స్పందించారు. ప్రజలకు, వైద్యులకు, పోలీసుల సేవలను ప్రశంసిస్తూ ఆయన ట్వీట్ చేశారు. నేడు 'వరల్డ్ హెల్త్ డే' సందర్భంగా తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా మహేష్ ఈ విధంగా పోస్టు చేసాడు. 'రెండు వారాల లాక్‌డౌన్ కాలంలో మనమంతా మానసికంగా చాలా బలంగా కనిపించాం. మన ప్రభుత్వాలు సమిష్టిగా తీసుకొన్న చర్యలు అభినందనీయం. కరోనాపై పోరాటాన్ని చూస్తూ మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకొని ఈ వరల్డ్ హెల్త్ డే జీవితంలో మరిచిపోలేని విధంగా మలచుకొందాం అని సూపర్‌స్టార్ మహేష్ బాబు అన్నారు.
కరోనావైరస్‌ను తరిమి కొట్టడానికి సోషల్ డిస్టెన్స్ పాటించడం, పరిశుభ్రత, ఆరోగ్య సూత్రాలను పాటించడమే కాకుండా మనం మరిన్ని విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అనవసరపు వార్తలు, ఫేక్ న్యూస్‌కు భయపడకుండా ఫియర్ డిస్టెన్స్‌ను కూడా అలవాటు చేసుకోవాలి అని మహేష్ బాబు సూచించాడు. కరోనావైరస్‌పై పోరాటానికి రోడ్లపై డ్యూటీ నిర్వహిస్తున్న పోలీసులు, ఇతర అధికారులు, అలాగే తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టి వైద్య చేస్తున్న డాక్టర్లకు మనం చేతులెత్తి మొక్కాలి. వారి సేవలను ఘనంగా కీర్తించాలి. వారందరినీ భగవంతుడు చల్లగా చూడాలి అని మహేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కరోనా ఓ వైపు విజృంభిస్తుంటే.. మరో పక్క అంతకంటే దారుణంగా ఫేక్ న్యూస్ విలయతాండవం చేస్తున్నాయి. ఇలాంటి తప్పుడు వార్తలకు దూరంగా ఉండాలి. వాటిని నమ్మకూడదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మానవత్వం, ప్రేమ, సానుకూలతను ప్రజల్లో పెంచాలి. తప్పకుండా ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడం ఖాయం. మీరంతా ఇంటి పట్టునే క్షేమంగా ఉండండి' అంటూ ట్వీట్ చేశారు.