Begin typing your search above and press return to search.
మహేష్ హుందాతనం వివరించిన యువతి!
By: Tupaki Desk | 28 April 2018 11:14 AM GMT`భరత్ అనే నేను` సినిమాను చూసి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫిదా అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్...టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, విలక్షణ దర్శకుడు కొరటాల శివలతో కలిసి `విజన్ ఫర్ ఎ బెటర్ టుమారో` అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన యువతీయువకులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఇంటరాక్టివ్ సెషన్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. మహేష్ తో మాట్లాడుతున్న సందర్భంలో ఓ యువతి తనకు గతంలో ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. అభిమానులతో మహేష్ ఎంత హుందాగా వ్యవహరిస్తారో మరోసారి ఆమె వివరించింది. తన అభిమానుల పట్ల ప్రిన్స్ చాలా కేర్ తీసుకుంటారని, అభిమానులతో ఆయన ప్రవర్తన హుందాగా ఉంటుందని తెలిపింది. ఆ యువతి చెప్పిన మాటలను విన్న కేటీఆర్...మహేష్ కు ఓ సరదా ప్రశ్న వేయడంతో ఆ ప్రాంగణమంతా నవ్వులు విరబూశాయి.
గతంలో ఓ సందర్భంలో మహేష్ తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించానని, అయితే, అక్కడ మహేష్ బౌన్సర్లు తనను అడ్డుకున్నారని ఆ యువతి గుర్తుచేసుకుంది. అది చూసిన మహేష్...ఆ బౌన్సర్లకు చెప్పి...తనతో సెల్ఫీ దిగారని ఆ యువతి గుర్తు చేసుకుంది. ఇది విన్న కేటీఆర్ ...మహేష్ పై సెటైర్ వేశారు. కేవలం అమ్మాయిలు సెల్ఫీలు దిగడానికి వచ్చినపుడు బౌన్సర్లను అడ్డుకుంటారా....లేక అబ్బాయిలతో కూడా ఇదే తరహాలో సెల్ఫీ దిగుతారా అని మహేష్ ను ఉద్దేశించి చమత్కరించారు. దీంతో, అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. దానికి మహేష్ కూడా తనదైన శైలిలో జవాబిచ్చారు. ఈ రకమైన ఇబ్బంది ప్రతిసారీ ఎదురవుతుందని, తన బౌన్సర్లు తనకు ఈ తరహా సమస్యలు తెచ్చిపెడుతుంటారని అన్నారు. తాను బౌన్సర్లపై కోప్పడుతూనే ఉంటానని చెప్పారు. మొత్తానికి ఆ యువతి వల్ల...మహేష్ అభిమానులతో ఎంత హుందాగా వ్యవహరిస్తారో మరోసారి వెల్లడైంది. అంతకుముందు విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వెళ్లిన మహేష్ కాలును ఓ అభిమాని తొక్కడంతో ఆయనకు గాయమైన సంగతి తెలిసిందే. అయితే, ఆ అభిమానిని మహేష్ కోప్పడకుండా...సున్నితంగా వ్యవహరించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
వీడియో కోసం క్లిక్ చేయండి