Begin typing your search above and press return to search.
వడ్డీతో సహా తిరిగిచ్చేస్తోన్న మహేష్
By: Tupaki Desk | 20 Dec 2016 5:06 AM GMTఅన్ని అనుకున్నట్టు జరిగితే ప్రతిష్టాత్మక తన 25వ సినిమాని మహేష్ పీవీపీ బ్యానర్లోనే చేసేవాడు. అందుకే పీవీపీ అధినేత ప్రసాద్ వీ పొట్లూరి ప్రిన్స్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ డిజైన్ చేయించి మూవీ లాంచింగ్ సూన్ అని కూడా వేయించారు. కానీ ఈ లోపు పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయ్. పీవీపీ ప్లేస్ లో మహేష్ సినిమా ప్రొడ్యూసర్స్ గా దిల్ రాజు.. అశ్వనీదత్ పేర్లు వినిపిస్తున్నాయ్. ఈ సడెన్ ఛేంజ్ కి కారణాలేంటో కరెక్ట్ గా ఎవరికీ తెలీదు కానీ బ్రహ్మోత్సవం ఫ్లాప్ ప్రభావం గట్టిగా ఉందని చెబుతున్నారు.
బ్రహ్మోత్సవం మూవీ ఇబ్బంది పెట్టినట్టుగా మహేష్ ని మరే చిత్రం ఇబ్బంది పెట్టి ఉండదు. కెరీర్లోనే దారుణమైన టాక్ తెచ్చుకొన్న సినిమాగానే కాదు ఆ తర్వాత కమిట్ మెంట్లకి కూడా బ్రహ్మోత్సవం అడ్డంగా మారింది. పైగా సేమ్ బ్యానర్ కి చేసి పెడతానని మాట ఇవ్వడమే కాదు భారీగా అడ్వాన్స్ కూడా తీసేసుకొన్నాడు. కాని చివరకు వంశీ పైడిపల్లి ప్రాజెక్టును దిల్ రాజు అండ్ అశ్వినీదత్ లతో చేస్తున్నాడు. అంతేకాదు తాను తీసుకొన్న అడ్వాన్స్ ని వడ్డీతో సహా తిరిగి చెల్లించడానికి రెడీ అవుతున్నాడట.
నిజానికి ఇతర నిర్మాతలతో కలిసి పీవీపీకి సినిమా చేయాలని మహేష్ ఆలోచించినప్పటికీ మిగిలిన వారు పీవీపీతో పని చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక పీవీపీకే టాటా చెప్పేయాలని ఫిక్స్ అయాడట. బ్రహ్మోత్సవానికి మహేష్ బాబు సహా నిర్మాతగా కూడా వ్యవహారించాడు. అయినా సరే అవేవీ పట్టించుకోకుండా పివిపి కి వచ్చిన లాసును పూడ్చేసి మహేష్ బయటకు మూవ్ అయిపోయాడనే టాక్ వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/