Begin typing your search above and press return to search.
బ్రహ్మోత్సవం లేట్.. మహేష్ రీజన్ చెప్పాడు
By: Tupaki Desk | 17 May 2016 11:30 AM GMTతన ప్రతి సినిమాకూ పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతుంటాడు మహేష్ బాబు. బౌండెడ్ స్క్రిప్టు లేకుండా.. ఏ రోజూ అతను షూటింగుకి వెళ్లడని అంటారు. షెడ్యూల్స్ కూడా పక్కాగా ఉండాలని నిర్మాతలకు కండిషన్ పెడతాడని కూడా చెబుతారు. గత కొన్నేళ్లుగా మహేష్ ఈ విషయంలో చాలా కాన్షియష్ గా ఉంటున్నాడు. అతడి సినిమాలు అనుకున్న టైంకి పూర్తయి.. అనుకున్న ప్రకారం రిలీజవుతున్నాయి. కానీ ‘బ్రహ్మోత్సవం’ మాత్రం షెడ్యూల్ ప్రకారం పూర్తవలేదు. అనుకున్నదానికంటే ఆలస్యమైంది. చివర్లో చాలా హడావుడిగా పని పూర్తి చేయాల్సి వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లోనూ కొంత గందరగోళం నడిచింది.
ఐతే శ్రీకాంత్ స్క్రిప్టు మీద మధ్యలో మహేష్ అసంతృప్తి వ్యక్తం చేశాడని.. షూటింగ్ ఆపించి ఇంకో వెర్షన్ రాయించాడని మధ్యలో వార్తలొచ్చాయి. దీనిపై మహేష్ స్పందిస్తూ అలాంటిదేమీ లేదని చెప్పాడు. బ్రహ్మోత్సవం ఆలస్యం కావడానికి కారణాలు వేరన్నాడు. ‘‘బ్రహ్మోత్సవం భారీ తారాగణం ఉన్న సినిమా. చాలా సన్నివేశాల్లో పాతికమంది దాకా నటీనటులుంటారు. ఇంతమందితో సన్నివేశాలు తీయడంలో చాలా కష్టం ఉంటుంది. ఎంత పర్ఫెక్టుగా ప్లాన్ చేసినా ఇంతమంది డేట్లను సర్దుబాటు చేసుకుని షూటింగ్ చేయడం చాలా కష్టం. ఒక్క రోజు అనుకున్న ప్రకారం షూటింగ్ జరగకున్నా చాలా ఇబ్బందవుతుంది. అలాంటి ఇబ్బందుల వల్లే కొన్ని షెడ్యూల్స్ తేడా వచ్చాయి. అందుకే ఏప్రిల్లో సినిమాను రిలీజ్ చేయలేకపోయాం. అయినప్పటికీ మే కూడా మంచి సీజనే. కాబట్టి ఇబ్బందేం లేదు’’ అని మహేష్ చెప్పాడు.