Begin typing your search above and press return to search.
స్టూడియోలు కట్టేయాలని నిర్మాత కాలేదు
By: Tupaki Desk | 29 July 2015 5:31 AM GMTఉన్నట్టుండి మహేష్ ఎందుకు నిర్మాతగా మారుతున్నట్టు? సహనిర్మాతగా అతడు ఎందుకు డైవర్ట్ అయినట్టు? ఇక నుంచి సొంత బ్యానర్ లో సినిమాలు తీయాలని సడెన్ గా ఎందుకు నిర్ణయించుకన్నట్టు? ఇలాంటి సందేహాలెన్నో అభిమానులకు ఉన్నాయి. వాటన్నిటికీ ప్రిన్స్ మహేస్ సమాధానం చెప్పాడు. ఇంకా చాలా సంగతులే చెప్పాడు.. అవేంటో చదవండి..
=ఉన్నట్టుండి నిర్మాణంలోకి ప్రవేశించడానికి కారణం ఉంది. ముందుగా కోప్రొడ్యూసర్ గా సినిమా మేకింగ్ లో, ప్రొడక్షన్ లో ఏం జరుగుతోందో పూర్తిగా పరిశీలించాలనుకుంటున్నా. దానివల్ల కొంత అనుభవం వస్తుంది. ఆ తర్వాత పూర్తిగా సినిమా నిర్మించడానికి ఏం అవసరమో క్లారిటీ వస్తుంది. పనిని ఎగ్జిక్యూట్ చేయడం, రియల్ ట్యాలెంటును వెతికి పట్టుకుని తెరపైకి తీసుకురావడం చాలా ఛాలెంజింగ్. దానికోసమే ఈ ప్రయత్నం. అలాగని ఇప్పటికిప్పుడు పెద్ద నిర్మాత అయిపోవాలని కలలుగనడం లేదు. అలాగే సొంతంగా స్టూడియోలు కట్టాలన్న ఆలోచన కూడా ఇప్పుడే లేదు.
=దర్శకత్వంలోకి వచ్చే ఆలోచన ఎప్పుడూ లేదు. ఎందుకంటే దానికి చాలా స్కిల్స్ కావాలి. నేను నటుడిగా చాలా సౌకర్యంగా ఉన్నా. అందువల్ల ఆ ఆలోచనే లేదు.
=డైరెక్టర్ కథ చెప్పినప్పుడు నచ్చితే వెంటనే ఓకే చెప్పేస్తా. ఓసారి కమిటయ్యాక ఇక నటన గురించి ఆలోచిస్తా. మిగతా విషయాల్లో వేలు పెట్టను. అయితే సెట్స్ కెళ్లముందే అన్ని సందేహాల్ని తీర్చేసుకుంటా. దర్శకుడికి నా సందేహాలన్నీ చెబుతాను. తర్వాత క్యారెక్టర్ లోకి ఎలా పరకాయం చేయాలా? అని మాత్రమే ఆలోచిస్తాను.
=నేను చిన్నప్పట్నుంచి చెన్నయ్ లో పెరిగాను. చాలా గ్రౌండ్ లెవల్ లోనే పెంపకం సాగింది. నాన్నగారు స్టార్ అన్న విషయాన్ని పక్కనబెట్టి చాలా సాదా సీదా జీవితాన్ని గడపడానికే ప్రాధాన్యతనిచ్చేవారు. నేను స్కూలుకి ఆటోలోనే వెళ్లేవాడిని. ఇప్పుడు అదే విషయాన్ని గౌతమ్ కి కూడా నేర్పించే ప్రయత్నం చేస్తున్నా. అయితే అదేమీ అనుకున్నంత సులువు కాదు. నేను పెద్ద స్టార్ అన్న సంగతి గౌతమ్ కి తెలుసు. తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని నమ్రతనే చూసుకుంటోంది. పెంపకంలో డౌన్ టు ఎర్త్ అనే విషయాన్ని గౌతమ్ కి నేర్పిస్తున్నాం.
=ఒక భారీ షెడ్యూల్ తర్వాత గ్యాప్ లో ఫ్యామిలీ తో కలిసి హాలీడేయింగ్ చేస్తుంటా. దానివల్ల తిరిగి ఎనర్జీ వస్తుంది. భార్య, పిల్లలతో గడపడమే రీఫ్రెష్ మెంట్.
=మురుగదాస్ తో కొన్నిసార్లు ముచ్చట్లు సాగాయి. ఓ మంచి స్క్రిప్ట్ కుదిరితే తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రానికి సిద్ధమే.
=బాలీవుడ్ తో పోలిస్తే టీవీ షోలు మనకి ఇంకా పెద్ద రేంజులో లేవు. కేవలం నాగార్జున కెబిసి మినహా ఆ స్థాయిలో కార్యక్రమాలేవీ లేవు. అందువల్ల ఇప్పటికైతే ఆ ప్లాన్స్ ఏవీ లేవు.