Begin typing your search above and press return to search.

F2 ఓ నవ్వుల హరివిల్లు అంటున్న మహేష్

By:  Tupaki Desk   |   13 Jan 2019 7:29 PM IST
F2 ఓ నవ్వుల హరివిల్లు అంటున్న మహేష్
X
సంక్రాంతి సీజన్ లో చివరగా విడుదలైన వెంకటేష్ - వరుణ్ తేజ్ ల మల్టిస్టారర్ 'F2' కు క్రిటిక్స్ నుండి యావరేజ్ మార్కులు తెచ్చుకున్నా ప్రేక్షకులు మాత్రం హిట్ అని తేల్చేశారు. ముఖ్యంగా వెంకీ తనదైన కామెడీ టైమింగ్ తో చెలరేగిపోవడంతో ఫ్యామిలీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మొదటి నుండి ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకీకి ఆదరణ ఎక్కువ. మరోసారి ఆ సెక్షన్ ను మెప్పించడంతో 'F2' హిట్ గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాను చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా 'F2' టీమ్ కు అభినందనలు తెలిపాడు. "#F2 ను చూశాను.. టోటల్ కామెడీ ఫిలిం! ఫుల్ గా ఎంజాయ్ చేశాను. వెంకీ సర్ తన పాత్రలో చెలరేగిపోయారు. అయన తన పాత్ర ఫన్నీ గా బ్రిలియంట్ గా పోషించారు. వరుణ్ తేజ్ కూడా వెంకీ సర్ టైమింగ్ ను మ్యాచ్ చేస్తూ ఫన్నీగా నటించాడు." మరో ట్వీట్ లో "డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో కమర్షియల్ బ్లాక్ బస్టర్ సాధించాడు. అనిల్ & టీమ్.. దిల్ రాజు గారు.. తమన్నా.. మెహ్రీన్.. దేవి శ్రీ ప్రసాద్.. అందరికీ కంగ్రాట్స్."

సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన ఇతర సినిమాలు 'ఎన్టీఆర్ కథానాయకుడు'.. రజనీకాంత్ 'పెట్టా'పై కూడా మహేష్ ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలిపాడు. మహేష్ 'వినయ విధేయ రామ' సినిమాపై మాత్రం తన స్పందనను తెలపలేదు.