Begin typing your search above and press return to search.

SSMB28 ః మహేష్‌ ఇంకా ఎన్ని పాత్రలు చేస్తాడు?

By:  Tupaki Desk   |   4 Jun 2021 7:30 AM GMT
SSMB28 ః మహేష్‌ ఇంకా ఎన్ని పాత్రలు చేస్తాడు?
X
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం రూపొందుతున్న సర్కారు వారి పాట తో పాటు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న త్రివిక్రమ్‌ మూవీ టైటిల్ గురించి ఇప్పటికే చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదే సమయంలో మహేష్‌ బాబు పాత్ర గురించి కూడా ఇండస్ట్రీ వర్గాల్లో కుప్పలు తెప్పలుగా ప్రచారం జరుగుతోంది. మొదట ఈ సినిమా ఒక బిజినెస్‌ మెన్‌ గా మహేష్‌ బాబు కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఇటీవల ఈ సినిమాలో మహేష్‌ బాబు రా ఏజెంట్‌ గా కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. రా ఏజెంట్‌ అంటూ కొన్నాళ్లు.. ఆ తర్వాత ఆర్మీ ఆఫీసర్ అంటూ కూడా పుకార్లు షికార్లు చేశాయి. చివరకు ఈ సినిమాలో మళ్లీ అండర్‌ కవర్‌ ఆఫీసర్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో మహేష్‌ బాబు ఎలా అయితే పోకిరి సినిమాలో కనిపించాడో ఇప్పుడు కూడా అలాగే కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున వస్తున్న ఈ పుకార్లపై స్పష్టత రావాల్సి ఉంది.

త్రివిక్రమ్‌ మూవీ కమర్షియల్ గా చాలా రిచ్‌ గా ఉంటుంది. మహేష్‌ బాబుతో చేయబోతున్న సినిమా కూడా అలాగే ఉంటుందని అంటున్నారు. కనుక పాత్ర విషయంలో ఇప్పుడే ఎలాంటి స్పష్టత ఇవ్వలేము అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు మహేష్ బాబు తదుపరి సినిమా కోసం స్క్రిప్ట్‌ ను రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.