Begin typing your search above and press return to search.
2020 ఓవర్సీస్ ప్రీమియర్ స్టార్స్
By: Tupaki Desk | 12 Jan 2020 4:43 AM GMTఇటీవలి కాలంలో తెలుగు సినిమా ఓవర్సీస్ (అమెరికా) వసూళ్లు ఆశించినంతగా లేని సంగతి తెలిసిందే. సైరా నరసింహారెడ్డి- సాహో లాంటి పాన్ ఇండియా సినిమాల వసూళ్లు సైతం ఆశాజనకంగా లేవు. ఈ రెండు భారీ చిత్రాలు అసాధారణ అంచనాల నడుమ విడుదలైనా ఓవర్సీస్ లో అంచనాలను అందుకోలేదు. గతేడాది విడుదలైన ఇతర పెద్ద సినిమాలు కూడా ఓవర్సీస్ లో ఊహించని విధంగా నిరాశపపరిచాయి. అయితే కొత్త ఏడాది ఆరంభమే సంక్రాంతి సినిమాల రూపంలో అదిరిపోయే ప్రీమియర్ వసూళ్లు దక్కడం శుభసూచికం.
సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు....స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రాలు ప్రీమియర్ వసూళ్లు సంతృప్తికరంగానే ఉన్నాయి. తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్ .. ప్రీమియర్లతో సరిలేరు చిత్రం శనివారం నాటికి వన్ మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. ప్రీమియర్లు .. డే వన్ వసూళ్లు కలుపుకుని ఈ ఫీట్ సాధ్యమైంది. ఓవర్సీస్ లో మహేష్ ఈ ఫీట్ సాధించడం 9వసారి కావడం విశేషం. ఇక ఓవర్సీస్ కాకుండా ఇతర చోట్ల ఓపెనింగులు ఎలా ఉండనున్నాయి? అన్నది ట్రేడ్ వెల్లడించాల్సి ఉంటుంది.
ఇక బన్నీ నటించిన అలవైకుంఠపురములో ప్రీమియర్ వసూళ్లు బావున్నాయి. 141 లోకేషన్ల నుంచి 4లక్షల 29 వేల డాలర్ల (సుమారు హాఫ్ మిలియన్) వసూళ్లను తెచ్చిపెట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం ఉదయానికే 6లక్షల డాలర్లను అధిగమించ నుందని ఇప్పటికే రిపోర్ట్ అందింది. ఇది ట్రేడ్ ముందస్తు అంచనా. పూర్తి లెక్కలు తెలియాల్సి ఉంది. థియేటర్ల సంఖ్య పెంచినట్లయితే అల వైకుంఠపురములో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.