Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్ ఫినిషింగ్.. ఇక ప్రమోషన్‌ షురూ

By:  Tupaki Desk   |   16 April 2022 12:30 PM GMT
సూపర్‌ స్టార్ ఫినిషింగ్.. ఇక ప్రమోషన్‌ షురూ
X
మహేష్‌ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఒక పాట మినహా షూటింగ్ పూర్తి అయినట్లుగా ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యుల నుండి అధికారిక ప్రకటన వచ్చింది. ఆ పాట చిత్రీకరణ విషయంలో త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరో వైపు సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మహేష్‌ బాబు తో పాటు ముఖ్య నటీ నటులు ఇప్పటికే తమ పాత్రలకు డబ్బింగ్ ను పూర్తి చేసినట్లుగా సమాచారం అందుతోంది.

ఒకటి రెండు రోజుల్లోనే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యే అవకాశం ఉంది. మరో వైపు రీ రికార్డింగ్ మరియు ఇతర పనులు కూడా జరుగుతున్నాయి. మొత్తానికి సినిమా ఫినిషింగ్ కు వచ్చినట్లే అంటూ సమాచారం అందుతోంది. మరో వారం రోజుల్లోనే ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వచ్చే నెల 12వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విడుదల విషయమై మొన్నటి వరకు కూడా అభిమానుల్లో అనుమానాలు ఉన్నాయి. షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.. నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభం కాలేదు.. కనుక సినిమా విడుదల అనుమానమే అంటూ చాలా మంది భావించారు. కాని అనూహ్యంగా సినిమా పనులు చకచక జరుగుతున్నాయి.

చివరి నిమిషంలో సినిమా యొక్క కార్యక్రమాల జోరు చాలా స్పీడ్ గా ఉంది. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్‌ బాబు చేస్తున్న సినిమా ఇదే అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

గీత గోవిందం దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను బ్యాంకింగ్‌ రంగంలో ఉన్న లోపాలు మరియు ఇతర విషయాల గురించి చూపించబోతున్నాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో మహేష్‌ కు జోడీగా నటించిన విషయం తెల్సిందే.