Begin typing your search above and press return to search.
ఆ హీరోయిన్ పై మహేష్ సెటైర్
By: Tupaki Desk | 19 April 2018 10:39 AM GMTమహేష్ బాబు మాట్లాడేది చాలా తక్కువ. తక్కువ మాట్లాడినా సెటైర్లు మాత్రం అప్పుడప్పుడు బాగానే వేస్తుంటాడు. తనతో చేసిన ఓ హీరోయిన్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు సెటైరికల్‌గా జవాబిచ్చాడు ప్రిన్స్ మహేష్. అతను చేసిన వన్ నేనొక్కడినే సినిమా ఎవరూ మర్చిపోలేరు. పెద్ద డిజాస్టర్ మూవీ. ఆ సినిమాలో కృతి సనన్ గురించే మీడియాతో కబుర్లు చెప్పాడు మహేష్.
కృతి సనన్ చాలా ఎత్తుగా ఉంటుంది. వన్ సినిమాలో చూస్తే దాదాపు మహేష్ బాబంతా ఎత్తు కనిపించింది. ఆ సినిమా ఒకట్రెండు సినిమాలు చేసి బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. ఇక ప్రస్తుతం మహేష్ తాజా సినిమా భరత్ అను నేను సినిమా హీరోయిన్ కైరా అద్వానీ. ఆమె కూడా కృతి లాగే హైటెక్కువ. విలేకరులు మహేష్ తో మాట్లాడుతూ కైరా పరిస్థితి కృతిలానే ఉంటుందా? హైట్ కారణంగా ఆమెకు కూడా సినిమాలు దక్కవా? అని ప్రశ్నించారు. అందుకు మహేష్ ఆమె అంత ఎత్తుగా ఉంటుందా? అన్నాడు. దానికి విలేకరులు మరెందుకు కృతికి తెలుగులో సినిమా అవకాశాలు రాలేదని ప్రశ్నించారు. అందుకు ప్రిన్స్ కృతినే చేయడం లేదేమో అని సెటైర్ వేశాడు. అవకాశాలు వచ్చినా వదులుకుని బాలీవుడ్ వెళ్లిందేమో అన్న అర్థం అందులో ధ్వనిస్తుంది.
మహేష్ మాట్లాడుతూ బాలీవుడ్ లో ప్రస్తుతం కృతి మంచి పొజిషన్ లోనే ఉందని అక్కడ ఆమె చాలా పాపులర్ అయిందని గుర్తు చేశారు. కైరా అద్వాణీ ఇప్పటికే రామ్ చరణ్ సినిమాలో చేస్తోందని చెప్పారు. ఆమె మరీ ఎక్కువ ఎత్తేమీ కాదని తెలుగు సినిమాలలో నటించేందుకు అది సమస్య కాబోదని చెప్పారు. భరత్ అను నేను సినిమా విడుదల సందర్భంగా మీడియా విలేకరులందరితో మాట్లాడాడు మహేష్ బాబు.