Begin typing your search above and press return to search.
నాకు రాజకీయాలు తెలియవంటున్న మహేశ్
By: Tupaki Desk | 13 April 2017 10:03 AM GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రాజకీయాల గురించి ఆసక్తికరమై వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు కథానాయకుడిగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం తెలుగుప్రేక్షకులతో పాటు దక్షిణాది సినీ వర్గాల్లో సైతం ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. స్పైడర్ సినిమాతో తమిళంలో కూడా మహేశ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా తమిళంలో ప్రముఖ పత్రిక అయిన వికటన్ కు మహేశ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తనకు రాజకీయాల గురించి తెలియవని మహేశ్ వెల్లడించారు. తనకు తెలిసిందల్లా సినిమా ఒక్కటేనని ఆయన ప్రకటించారు. చెన్నై తన స్వంత ఊరు లాంటిదని మహేశ్ చెప్పారు. చెన్నైలోనే 25 ఏళ్లు పెరిగానని చెప్పిన మహేశ్ తమిళంలో ప్రముఖ నటులైన సూర్య - కార్తీ - యువన్ శంకర్ రాజా - తన స్కూల్ మేట్స్ అని చెప్పారు. కాగా, గతంలో ఒకసారి సైతం మహేశ్ రాజకీయాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు గౌతమ్ కు రాజకీయాల గురించి ఎంత తెలుసో తనకూ అంతే తెలుసునని చమత్కరించారు.
కాగా, మహేష్ బాబు కథానాయకుడిగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం టైటిల్ విషయం గత కొంతకాలంగా చర్చనీయాంశమయింది. ఈ చిత్రానికి సంభవామి - వాస్కోడగామ - ఏజెంట్ శివ - మర్మం అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు టైటిల్ కోసం ఆతృతగా ఎదురుచూశారు. వారి సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ తాజాగా ఈ సినిమాకు స్పైడర్ అనే టైటిల్ ను ఖరారు చేసి ఫస్ట్ లుక్ ను బుధవారం విడుదల చేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు రహస్య ఆపరేషన్ ను నిర్వహించే ఇంటెలిజెన్స్ పోలీసాఫీసర్ గా కనిపిస్తారని వార్తలొచ్చాయి. వాటికి బలం చేకూర్చుతూ తొలి ప్రచార చిత్రంలో మహేష్‌బాబు క్లాస్ లుక్స్ తో స్టైలిష్ గా దర్శనమిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు గూఢచారి అయిన పోలీస్ అధికారిగా శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారని సమాచారం.
రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయిందని, జూన్ 23న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర బృందం తెలిపింది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్.సినిమా ఎల్ ఎల్ పి, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నది. ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ - ఎడిటింగ్:శ్రీకరప్రసాద్ - ప్రొడక్షన్ డిజైనర్: రూపిన్ సుచక్ - ఫైట్స్: పీటర్ హెయిన్స్ - సంగీతం: హేరిస్ జయరాజ్ - కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/