Begin typing your search above and press return to search.

మహేష్ ఆ ఇద్ద‌రు డైరెక్ట‌ర్ల‌కి భ‌లేగా హ్యాండ్ ఇచ్చాడు...!

By:  Tupaki Desk   |   29 Aug 2020 9:30 AM GMT
మహేష్ ఆ ఇద్ద‌రు డైరెక్ట‌ర్ల‌కి భ‌లేగా హ్యాండ్ ఇచ్చాడు...!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఇప్పటి వరకు 26 చిత్రాలు తెరకెక్కాయి. హ్యాట్రిక్ విజయాలతో దూకుడుమీదున్న మహేష్.. ప్రస్తుతం 27వ చిత్రంగా పరశురామ్ పెట్లా దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రాన్ని ప్రకటించాడు. అయితే మహేష్ బాబు తనకు హిట్ ఇచ్చిన దర్శకుడుకి మరియు ప్లాప్ ఇచ్చిన దర్శకుడికి మొండిచేయి చూపించాడని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు. ఆ ఇద్దరు ఎవరో కాదు.. ఒకరు వంశీ పైడిప‌ల్లి మ‌రొక‌రు మురుగ‌దాస్. ఇక ఈ ఇద్ద‌రు డైరెక్ట‌ర్లతో మ‌హేశ్ సినిమా ఉండకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు కెరీర్లో మైలురాయిగా నిలిపోయే సిల్వర్ జూబ్లీ చిత్రం 'మహర్షి' కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పటికి మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా వంశీ పైడిపల్లితోనే కమిట్ అయ్యాడు మహేష్. అయితే వంశీ ఈ ఏడాది కాలం కూర్చొని రెడీ చేసుకున్న స్క్రిప్ట్ మహేష్ ని ఇంప్రెస్ చేయలేకపోయాడనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో మహేష్ వంశీ పైడిపల్లిని పక్కనపెట్టి పరశురామ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మహేష్ తదుపరి సినిమా రాజమౌళితో కమిట్ అవడంతో ఇక మహేష్ - వంశీ కాంబోలో ఇప్పట్లో సినిమా ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

మరోవైపు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగ‌దాస్ మహేష్ బాబుతో 'స్పైడర్' అనే ద్విభాషా చిత్రం చేశాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో ఎలాగైనా మహేష్ తో మరో సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని శపథం పట్టాడు మురుగ‌దాస్. అయితే మహేష్ ఇప్పుడు మురగదాస్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. కాకపోతే మ‌హేశ్ తో సినిమా చేయ‌క‌పోయిన‌ప్ప‌టికీ మురుగ‌దాస్ కి పెద్ద న‌ష్టమేమీ లేదు. ఎందుకంటే త‌మిళ స్టార్ హీరోలంతా మురుగ‌దాస్ ని లైన్ లో పెట్టుకున్నారు.

కానీ మహేష్ తో త‌ప్ప వేరే హీరోల‌తో సినిమాలు చేయ‌కుండా వెయిట్ చేసిన వంశీ పైడిప‌ల్లి మాత్రం బాగానే న‌ష్ట‌పోయాడని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. మహేష్ సినిమా క్యాన్సిల్ అవడంతో చేసేదేమిలేక వంశీ ప్ర‌స్తుతం 'ఆహా' యాప్ కోసం ప‌నిచేస్తున్నాడట. అందులో క్రియేటివ్ పార్ట్ మొత్తం వంశీ పైడిప‌ల్లి చూసుకుంటున్నాడ‌ని సమాచారం.