Begin typing your search above and press return to search.

కూతురు సితారతో మహేష్ సెల్ఫీల జాతర..!

By:  Tupaki Desk   |   21 April 2020 3:51 PM GMT
కూతురు సితారతో మహేష్ సెల్ఫీల జాతర..!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. ఇప్పటి వరకు మిస్ అయిన సమయమంతా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు. కుటుంబానికి ఎంతో విలువ ఇస్తాడు మహేష్. కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయిన ఆయన కాలు కూడా బయట పెట్టట్లేదట. అందులో ముఖ్యంగా ఈ లాక్ డౌన్ లో ఏం చేయాలనేది కూడా ప్లాన్ చేసుకున్నాడు. షూటింగ్స్ సమయంలో మహేష్ కి పిల్లలతో గడిపే సమయం దొరకదు. అందుకే ఈ కరోనా తీసుకొచ్చిన హాలీడేస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం సితార, గౌతమ్‌లతో మహేష్ బాబు రోజంతా ఆటలు ఆడుకుంటున్నాడు. సినిమాలు చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నాడట.

ఇక ముఖ్యంగా కూతురు సితార అయితే మహేష్ ని ఒక్క క్షణం కూడా వదలడం లేదట. తాజాగా మహేష్ కూతురుతో ఆడుకుంటూ సెల్ఫీ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఆ ఫోటోలో తండ్రి కూతురు ఇద్దరు కూడా కెమెరా వైపు కన్నుగీటుతున్నారు. ఆ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక మహేష్ కి రోజూ పొద్దున్నే లేవడం.. పిల్లలతో ఆడుకోవడమే సరిపోతుందట. సితార పాప అయితే తండ్రిని వదలడంలేదు. ఏం చేసినా కూడా పక్కనే ఉంటుందట. ఈ ఏడాదిని సరిలేరు నీకెవ్వరు సంచలన విజయంతో ప్రారంభించిన మహేష్. త్వరలోనే పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.