Begin typing your search above and press return to search.
ఏఎంబీలో మహేష్ వాట అంత తక్కువనా?
By: Tupaki Desk | 2 Dec 2018 4:45 PM GMTసూపర్ స్టార్ మహేష్ బాబును ఇప్పటి వరకు మనం హీరోగా, బ్రాండ్ అంబాసిడర్ గా, ఒకటి రెండు సినిమాలకు సహ నిర్మాతగా మాత్రమే చూశాం. కాని నేటి నుండి ఆయన ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ అధినేతగా చెప్పుకోవాలి. ఏషియన్ సునీల్ తో కలిసి మహేష్ బాబు నిర్మించిన ఏఎంబీ సినిమాస్ నేడు ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ మల్టీప్లెక్స్ గురించి గత కొంత కాలంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సినీ జనాల్లో మరియు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.
ఏఎంబీ మల్టీప్లెక్స్ లో మహేష్ బాబుకు మెజార్టీ వాటా ఉంటుందని అంతా భావించారు. కాని మహేష్ బాబు వాట చాలా తక్కువ అని, ఏషియన్ సినిమాలు మెజార్టీ వాటాను కలిగి ఉన్న ఈ మల్టీప్లెక్స్ లో మరో నలుగురు వాటా దారులు కూడా ఉన్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏఎంబీ సినిమాకు అంబాసిడర్ గా వ్యవహరించడంతో పాటు, కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మహేష్ కు 20 శాతం వాటాను ఏఎంబీలో ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
మహేష్ బాబు 20 శాతం వాటా అంటూ వస్తున్న వార్తలను కొందరు కొట్టి పారేస్తున్నారు. 20 శాతం వాటాకే మహేష్ బాబు పేరును ఎలా పెడతారని, దాదాపుగా సగం వాటా మహేష్ కు ఉండి ఉంటుందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏఎంబీలో మహేష్ రెండు స్క్రీన్స్ ను సొంతంగా కలిగి ఉన్నాడని - మరో రెండు స్క్రీన్స్ లో షేర్ కలిగి ఉన్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి ఏఎంబీ సినిమాస్ గురించి పెద్ద ఎత్తున పబ్లిసిటీ రావడంతో ఆ మల్టీప్లెక్స్‌కు ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.