Begin typing your search above and press return to search.

మహేష్ కొడుకు అదరగొట్టేశాడుగా

By:  Tupaki Desk   |   6 Jun 2018 10:04 AM
మహేష్ కొడుకు అదరగొట్టేశాడుగా
X
టాలీవుడ్ లో స్టార్ హీరోల నెక్స్ట్ జనరేషన్ కథానాయకుల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టీనేజ్ లో ఉండగానే వారికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా పెరిగిపోతోంది. ముఖ్యంగా మహేష్ కుమారుడు గౌతమ్ ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. ఫొటోలు కనిపిస్తే చాలు సూపర్ స్టార్ అభిమానులు తెగ షేర్ చేసుకుంటున్నారు. సాధారణంగా మహేష్ చాలా తక్కువ మాట్లాడతారని అందరికి తెలిసిందే.

సినిమాలు తప్ప మరో విషయాల గురించి స్పందించడు. కేవలం తెరపై మాత్రమే తన టాలెంట్ ను చూపిస్తాడు. కనీసం సినిమా వేడుకలలో డైలాగ్ కూడా చెప్పాడు. మహేష్ కి సిగ్గు ఎక్కువని అందరు అంటుంటారు. అది చాలా సందర్భాల్లో కనిపించింది. ఇకపోతే మహేష్ కుమారుడికి కూడా అదే అలవాటు వచ్చిందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎందుకంటే గౌతమ్ కూడా చెల్లి సితార అంత స్పీడ్ గా ఉండడు.

మహేష్ సినిమాలు వస్తే ఆ సినిమాలోని పాటలను పాడేస్తూ సితార ప్రమోషన్స్ గట్టిగా చేస్తుంటుంది. అయితే గౌతమ్ పెద్దగా స్పందించడు. కానీ మొదటి సారి ఘట్టమనేని మూడవతరం వారసుడు డబ్ స్మాష్ తో అలరించాడు. ఇంతకుముందు 1 నేనొక్కడినే సినిమాలో అద్భుతంగా నటించి గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ ఇప్పుడు మంచి లిప్ టైమింగ్ తో డబ్ స్మాష్ తో అలరించాడు. అందుకు సంబందించిన వీడియో వైరల్ అవుతోంది.