Begin typing your search above and press return to search.

వయ్యారితో సాంగేసుకుంటున్న మహేష్‌

By:  Tupaki Desk   |   23 May 2015 7:00 PM IST
వయ్యారితో సాంగేసుకుంటున్న మహేష్‌
X
ఆగడు చిత్రంలో ఐటెమ్‌ పాటలో నర్తించింది శ్రుతిహాసన్‌. ఆ తర్వాత మహేష్‌ సినిమాలో ఏకంగా నాయికగా అవకాశం అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్‌ సరసన నటించేస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి అధికారికంగా టైటిల్‌ని ప్రకటించనున్నారు.

ఈ నెల 31న సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ ఆవిష్కరణలో టైటిల్‌ని ప్రకటించడానికి దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. అయితే ఈలోగానే ఓ అదిరిపోయే పాటని మహేష్‌ - శ్రుతిహాసన్‌ జంటపై చిత్రీకరించనున్నారు. అందుకోసం ఇప్పటికే రామోజీ పిలింసిటీలో ఓ భారీ సెట్‌ వేశారు. హైదరాబాద్‌లో వేరొక చోట మరో సెట్‌ వేశారు. ఈ రెండుచోట్లా ఈ పాటని ఈరోజు నుంచి తెరకెక్కిస్తున్నారు. శ్రుతికి ఇది ఓ కొత్త అనుభవం. మహేష్‌ అంతటి సూపర్‌స్టార్‌తో కాలు కదిపే సందర్భం. స్టయిలిష్‌ అప్పియరెన్స్‌తో పాటు మహేష్‌ స్టెప్పుల్లో సంథింగ్‌ స్టయిలిష్‌ ఈజ్‌ కనిపిస్తుంది.కాబట్టి శ్రుతి వేసే స్టెప్పుల్లో కాస్త స్టయిలిష్‌నెస్‌ కనిపించాల్సిందే.

రేసుగుర్రంలో బన్నీ, రామయ్యా వస్తావయ్యా చిత్రంలో ఎన్టీఆర్‌ లాంటి స్టార్‌లతో స్టెప్పులేసింది కాబట్టి ఇప్పుడు శ్రుతి ఈజీగానే స్టెప్పులేయగలదు. కానీ స్టయిలిష్‌ స్టెప్పులతో ఆకట్టుకునే సందర్భం మహేష్‌తోనే కుదురుతుంది.