Begin typing your search above and press return to search.

పార్టీ ఎక్కడో చెప్పు.. వచ్చేస్తా -మహేష్‌

By:  Tupaki Desk   |   20 Sep 2015 4:14 PM GMT
పార్టీ ఎక్కడో చెప్పు.. వచ్చేస్తా -మహేష్‌
X
చక్కగా ఎప్పుడూ నవ్వుతూ ఏదైనా చెప్పేస్తాడు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు. అఖిల్‌ ఆడియో లాంచ్‌ కు ప్రత్యేకమైన గెస్టుగా వచ్చిన ఆయన.. ట్రైలర్‌ లాంచ్‌ చేసి, ఆ ట్రైలర్‌ లాంచ్‌ చేసి నాలుగు మాటలతో అందరినీ ఉర్రూతలూగించాడు.

''మనం సినిమా రిలీజ్‌ అయినపుడు నాగార్జున గారికి ఫోన్‌ చేసి సార్‌ లాస్టులో అఖిల్‌ ఇరగదీశాడు అని చెబితే.. మేం కష్టపడి సినిమా చేస్తే క్రెడిట్‌ అఖిల్‌ తీసుకుపోయాడు అన్నారు. కాని అది నిజం సార్‌. నిజంగానే అఖిల్‌ ఇరగదీశాడు సార్‌'' అంటూ చెప్పాడు మహేష్‌. ఇక సినిమా ట్రైలర్‌ విషయానికి వస్తూ.. ''అఖిల్‌.. సినిమా రిలీజ్‌ అయ్యాక పార్టీ ఎక్కడో చెప్పు.. వచ్చేస్తా.. ట్రైలర్‌ చాలా బాగుంది. ఎందుకంటే ఒక హీరోను ఓ రేంజులో చూపించాలంటే వినాయక్‌ గారి తరువాతే. సార్‌.. తెలుగు ఇండ్రస్టీకి మరో పెద్ద స్టార్‌ హీరోను ఇచ్చినందుకు థ్యాంక్స్‌'' అంటూ ముగించాడు.