Begin typing your search above and press return to search.

రానురాను మహేష్ ఇలా అవుతున్నాడేంటి.. బ్రదర్!

By:  Tupaki Desk   |   23 May 2020 2:30 AM GMT
రానురాను మహేష్ ఇలా అవుతున్నాడేంటి.. బ్రదర్!
X
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా గృహ నిర్బంధం విధించడంతో సెలెబ్రెటీలందరూ ఎవరిళ్ళకు వారే పరిమితమయ్యారు. ఎప్పుడూ బిజీగా ఉండే సినీ తారలు కూడా ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు. ఇక దొరికిన ఈ సమయాన్ని కుటుంబంతో గడిపేస్తున్నారు. సినిమాల షూటింగ్స్ తో క్యాలెండర్ మొత్తం ఫుల్ బిజీగా ఉండే సినీ స్టార్స్ అంతా ఇలా నెలల పాటు ఎటు వెళ్లకుండా ఇంట్లోనే టైం స్పెండ్ చేయడంతో వారి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాడు. అందుకే ప్రస్తుతం ఖాళీ సమయాన్ని పూర్తిగా భార్య పిల్లలకే కేటాయించాడు. ప్రస్తుతం పిల్లలు సితార - గౌతమ్‌ లతో మహేష్ బాబు డైలీ ఆడుకుంటున్నాడట.

అలాగే కొత్త సినిమాలు - వెబ్ సిరీస్‌ లు ఏవీ వదలకుండా చూస్తున్నాడట. అన్నింటికంటే ముఖ్యంగా సితార - గౌతమ్ లతో పాటు రోజురోజుకి మహేష్ కూడా యంగ్ అవుతున్నాడు. తాజాగా కొడుకులు ఇద్దరు బ్లూ టి షర్ట్ ధరించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు నమ్రత. ఈ ఫోటో చూస్తే ఎవరైనా ఇతను మహేష్ బాబేనా.. లేక గౌతమ్ కి బ్రదరా.. అంటూ ఆశ్చర్యపోక తప్పదు. అలా ఉన్నారు మరి తండ్రీకొడుకులు. కొడుకుతో టైమ్ స్పెండ్ చేయడానికే మహేష్ బాబుకు రోజంతా సరిపోతుందని ఈ ఫోటోతో అర్థం అవుతుంది. పెరుగుతున్న గౌతమ్ కి మహేష్ తగిన సూచనలు చేస్తున్నట్లు సమాచారం. మహేష్ 40యేళ్లు క్రాస్ చేసాడు. ఆయన కొడుకు గౌతమ్ కూడా వేగంగా పెరుగుతున్నాడు. నిజంగా రానురాను మహేష్ - గౌతమ్ ఫాదర్ సన్ లా మాత్రం ఉండరని అనిపిస్తుంది. ఒకే ఏజ్ ఫ్రెండ్స్ లా కనిపిస్తారని చెప్పవచ్చు. లేడీ ఫ్యాన్స్ అయితే మహేష్ ని చూసి ఫుల్ ఫిదా అవుతున్నారు.