Begin typing your search above and press return to search.
150 కోట్లు.. మహేష్ బాబా మజాకా
By: Tupaki Desk | 6 April 2017 10:59 AM GMT1 నేనొక్కడినే.. ఆగడు లాంటి డిజాస్టర్ల తర్వాత మహేష్ చేసిన సినిమా ‘శ్రీమంతుడు’. అయినప్పటికీ ఆ చిత్రానికి మహేష్ కెరీర్లోనే అత్యధికంగా బిజినెస్ జరిగింది. వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. దీన్ని బట్టే మహేష్ స్టామినా మీద ఫెయిల్యూర్లు పెద్దగా ప్రభావం చూపించవని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ లాంటి ఆల్ టైం డిజాస్టర్ తర్వాత వస్తున్న మహేష్ కొత్త సినిమా కూడా బిజినెస్ పరంగా సరికొత్త ఎత్తుల్ని చూడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మొత్తంగా రూ.150 కోట్ల దాకా ఆదాయం తెచ్చిపెడుతున్నట్లు సమాచారం.
మహేష్-మురుగదాస్ మూవీ తెలుగు-తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఐతే మురుగదాస్ కు హిందీలోనూ మంచి పేరుండటం.. మహేష్ కూడా అక్కడి వాళ్లకు బాగానే పరిచయం కావడంతో ఈ చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేస్తారట. ఏ భాషకు ఆ భాషలో ఈ చిత్రానికి మంచి డిమాండే ఉంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఏరియాలకు కలిపి రూ.36 కోట్లకు అమ్ముతున్నట్లు సమాచారం. తెలంగాణ హక్కులు మినిమం రూ.20 కోట్లు తెచ్చిపెట్టడం గ్యారెంటీ.
ఇక మూడు భాషలకూ కలిపి ఓవర్సీస్ రైట్స్ రూ.20 కోట్ల దాకా పలుకుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు థియేట్రికల్ రైట్స్ రూ.18 కోట్లు తెచ్చిపెడుతున్నాయట. ఇంకా కేరళలోనూ ఈ సినిమాకు మంచి డిమాండుంది. కర్ణాటక గురించి చెప్పాల్సిన పని లేదు. ఇవి కాక హిందీ థియేట్రికల్ రైట్స్ ఉన్నాయి. శాటిలైట్ హక్కులూ అమ్మాల్సి ఉంది. అన్నీ కలిపితే ప్రి రిలీజ్ బిజినెస్ రూ.150 కోట్లకు రీచ్ అవుతున్నట్లు సమాచారం. ఈ సినిమాను రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. జూన్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/