Begin typing your search above and press return to search.

స్పైడర్ రొమేనియా సాంగ్ షూట్ చూశారా?

By:  Tupaki Desk   |   28 Aug 2017 5:25 PM GMT
స్పైడర్ రొమేనియా సాంగ్ షూట్ చూశారా?
X
మహేష్ బాబు సినిమా అప్ డేట్స్ అంటే చాలు.. టాలీవుడ్ ఆడియన్స్ లో బోలెడంత ఆసక్తి మొదలైపోతుంది. అందుకే ఏ చిన్న కబురు అయినా.. చాలా పెద్ద న్యూస్ మాదిరిగా వైరల్ అయిపోతూ ఉంటుంది. మరి పెద్ద న్యూసే అయితే.. ఇంకెంత ట్రెండింగ్ అవుతుందో చెప్పాల్సిన పనే లేదు.

మురుగ దాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న స్పైడర్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. గతేడాది సమ్మర్ లో బ్రహ్మోత్సవం డిజప్పాయింట్ చేశాక.. ఇప్పటికి ఏడాదికి పైగా టైం గడిచిపోయింది. ఇంత కాలం ఓపిక పట్టిన అభిమానులు.. వచ్చే నెల 27న విడుదల కాబోతోన్న స్పైడర్ పై ఓ కన్నేసి ఉంచారు. పైగా ఇప్పుడు మహేష్ రొమేనియాలో ఉన్నాడని.. అక్కడ రకుల్ ప్రీత్ తో కలిసి రొమాన్స్ చేస్తూ ఓ సాంగ్ షూట్ లో పాల్గొంటున్నాడని వారికి తెలుసు. ఈ పాట పూర్తవడం కోసం అభిమానులలో చాలానే ఆతృత ఉంది. ఎందుకంటే.. ఈ సాంగ్ కంప్లీట్ అయితేనే.. స్పైడర్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు కదా. అందుకే వారిలో అంత ఉత్సాహం కనిపిస్తోంది.

ఇప్పుడు మహేష్-రకుల్ కలిసి రొమేనియాలో చిత్రీకరిస్తున్న పాటకు సంబంధించిన పిక్స్.. నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. హీరో హీరోయిన్లు క్లియర్ గా కనిపించే పిక్స్ ఒకటి రెండే ఉన్నా.. ఈ పాట ఎంత లావిష్ గా తెరకెక్కిస్తున్నారనే సంగతి మాత్రం.. ఈ ఫోటోల ద్వారా అర్ధమవుతుంది. ఇంత అందమైన ప్రదేశంలో చూడచక్కని జంటను.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ మరెంత అందంగా చూపించి ఉంటాడో ఊహించేసుకుని తెగ సంబరపడిపోతున్నారు మహేష్ అభిమానులు.