Begin typing your search above and press return to search.

స్పైడర్ కు అడగడం తప్పులేదులే

By:  Tupaki Desk   |   18 Sept 2017 11:06 AM IST
స్పైడర్ కు అడగడం తప్పులేదులే
X
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ స్పైడర్.. రిలీజ్ కి రెడీ అయిపోయింది. అంచనాలు మరీ తారాస్థాయికి చేరిపోవడంతో.. హైప్ ను కంట్రోల్ చేయడం కోసం.. టీజర్.. ట్రైలర్ లను సింపుల్ గా కట్ చేశాడు దర్శకుడు మురుగదాస్. అయితే.. మూవీలో ఎన్నో ఊహించని థ్రిల్స్ ఉంటాయని.. అవన్నీ వెండితెరపై చూస్తున్న ప్రేక్షకులకు ఊహించని విధంగా థ్రిల్ చేస్తాయని అంటున్నారు. అయితే.. ఈ మూవీకి అయిన బిజినెస్ మాత్రం.. కొంతమందిని కలవరబెడుతోంది.

బాహుబలి సిరీస్.. కబాలి తర్వాత.. సౌతిండియాలో 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీ స్పైడర్ మాత్రమే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే.. చాలా పెద్ద మొత్తాలకే ఏరియా హక్కుల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అందుకే ఈ మొత్తాన్ని రాబట్టుకునేందుకు అదనపు షోలను ప్రదర్శించేందుకు అనుమతుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో అన్ని సినిమాలకు ఇప్పటికే రోజుకు 5 షోలకు అనుమతులు రాగా.. ఏపీలో మాత్రం ఈ విషయం ఇంకా పెండింగ్ లో ఉంది. అందుకే ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు చేసుకుంటున్నారు.

పైగా దసరా వీకెండ్ కావడం.. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ తరఫున మహేష్ బావ గల్లా జయదేవ్ ఎంపీగా ఉండడంతో.. ఇప్పుడు మహేష్ సినిమాకు రోజుకు ఐదు ప్రదర్శనలు వేసుకునేందుకు అనుమతులు రావడం పెద్ద కష్టమేమీ కాదని అంచనా వేసుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఈ పర్మిషన్స్ వస్తే మాత్రం.. భారీ మొత్తాలకు కొనుగోలు చేసిన వారికి ఊరటే.