Begin typing your search above and press return to search.
తారక మహేష్ మంత్రాలు ఫలిస్తాయా?
By: Tupaki Desk | 21 Sep 2017 4:05 AM GMTటాలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య పోటీ ఉండడం సాధారణమైన విషయమే. హీరోల కన్నా వారి అభిమానుల్లోనే టెన్షన్ ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే తమ హీరోనే ఈ సారి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టాలని అనుకుంటారు. అయితే ఈ సారి విడుదలయ్యే రెండు సినిమాలకు అభిమానులు అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. స్పైడర్ - జై లవకుశ ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా అసలైన బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలుస్తుందనేది ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న.
మహేష్ - ఎన్టీఆర్.. వీరి కెరీర్లో ఆ రెండు సినిమాలు చాలా పెద్దవి. ఇద్దరికి వారి సినిమాలు తప్పక విజయాన్ని అందిస్తాయని తెలుస్తోంది. ఎందుకంటే.. ముందుగా ఈరోజు రిలీజ్ కాబోతున్న జై లవకుశ కంటెంట్ - టీజర్స్ తోనే అందరిని ఆకట్టుకుంది. అలాగే తారక్ తారాస్థాయిలో నిర్వహించిన ప్రమోషన్స్ సక్సెస్ అయ్యాయి. అంతే కాకుండా వారం వరకు ఏ సినిమా అడ్డులేదు. ధేయేటర్స్ అన్నీ ఈ సినిమావే.. దీంతో పాజిటివ్ టాక్ వస్తే..వారంలోనే రాబట్టాల్సిన అసలు వసూళ్లను డౌట్ లేకుండా రాబట్టేస్తుంది. అంతే కాకుండా గత చిత్ర విజయాలు ఎన్టీఆర్ కి చాలా వరకు ఉపయోగపడనున్నాయి. నాన్నకు ప్రేమతో - జనతా గ్యారేజ్ వంటి సినిమాలు తారక్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ని దగ్గర చేశాయి. దీంతో జై లవకుశ అదే తరహాలో మంచి కథాంశంతో ఉండడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా భారీస్థాయిలో వస్తారు.
ఇక మహేష్ -స్పైడర్ విషయానికి వస్తే కేవలం తన స్టార్ స్టామినా తో సౌత్ లో మొదటి సారి భారీ స్థాయిలో తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు ప్రిన్స్. గత చిత్రం బ్రహ్మోత్సవం రిజల్ట్ ఈ సినిమాపై ఏ మాత్రం ప్రభావం చూపడానికి వీలు లేదనే చెప్పాలి. ఎందుకంటే దర్శకుడు మురుగదాస్ గురించి అందరికి తెలిసిందే.. దానితో పాటు మహేష్ ఎప్పుడు కష్టపడని విధంగా సినిమా కోసం వర్క్ చేసినట్లు టాక్ ఉంది. అంతే కాకుండా స్పైథ్రిల్లర్ కావడంతో మహేష్ అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు కూడా సినిమాను చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉండడంతో మరొక ప్లస్ అని చెప్పవచ్చు. మలయాళంలో కూడా సినిమా రిలీజ్ అవుతుండడంతో ఈ ఇయర్ బాహుబలి తర్వాత సౌత్ లో స్పైడర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
చూస్తుంటే.. మహేష్ - ఎన్టీఆర్ కరెక్ట్ టైమ్ కి సరైన సమయంలో ఆలోచించి రిలీజ్ చేస్తున్నారు. ఒకదాని ప్రభావం మరొకదానిపై పడకుండా.. ఇరు అభిమానులను ఎవరి స్థాయిలో వారిని హ్యాపీ చేయడానిక్ డిసైడ్ అయ్యారని చెప్పవచ్చు. మరి ఎంతవరకు ఈ హీరోలు విజయం సాదిస్తారో చూడాలి.