Begin typing your search above and press return to search.
'స్పైడర్' గురించి అలా చెప్పకండి ప్లీజ్
By: Tupaki Desk | 1 Jun 2017 10:24 AM GMT'స్టయిలిష్' 'రాకింగ్' ఇలాంటి పదాలకు పెద్దగా విలువ లేకుండా పోయింది తెలుగు ఇండస్ర్టీలో. ఒక స్టార్ హీరో ఎప్పుడూ కనిపించే విధంగా కనిపించినా చాలా.. మనోళ్ళు ఇవే పదాలను వాడుతుంటారు. ఇక ఏదైనా టీజర్ వచ్చినప్పుడో ట్రైలర్ రిలీజైనప్పుడో చూడాలి.. మనాళ్ళ డిక్షనరీలో నుండి ట్విట్టర్ టైమ్ లైన్లోకి వచ్చే పదాలు ఇవే. కాని ''స్పైడర్'' విషయంలో కూడా ఇవే వాడతారని ఎవ్వరూ అనుకోలేదు.
ఎంతసేపూ కేవలం తమ బుద్దిబలం.. తమ కండబలం.. తమ అందం.. తమ టైమింగ్.. తమ గ్లామర్ చుట్టూతా తిరిగే కథలనే తెలుగు స్టార్ హీరోలు ఎక్కువగా ఎంచుకుంటున్న రోజుల్లో.. ఇప్పుడు రజనీకాంత్ రోబో మరియు రోబో 2.0 సినిమాలతో ఎలాగైతే సైన్స్ ఫిక్షన్ జానర్ ను గట్టిగా ప్రయత్నిస్తున్నారో.. రజనీ తరువాత ఆ పనిచేస్తోంది కేవలం మహేష్ మాత్రమే. ముఖ్యంగా 'స్పైడర్' తొలి టీజర్ చూస్తే.. అసలు ఒక రోబో సాలీడు చుట్టూ కథ తిప్పుతూ.. దానిపేరే సినిమాకు పెట్టి.. ఎంతపెద్ద సాహసం చేశాడో చూసుకోండి. ఇటువంటి ప్రయత్నాలను.. ''ఇన్నోవేటివ్'' ''హాలీవుడ్ రేంజ్ వర్క్'' అంటే బాగుంటుంది కాని.. ఏదో మూస కమర్షియల్ సినిమా టీజర్ రాగానే చెప్పినట్లు.. 'స్టయిలిష్' అండ్ 'రాకింగ్' ఏంటండీ బాబూ? వినడానికే కామెడీగా ఉంది.
అయితే మనోళ్లకు పొగడటం చేతకాదని అనుకోవాలి.. లేదంటే వీళ్ళకి ప్రతీ సినిమా మూసగానే కనిపిస్తూ ఉండాలి. మహేష్ బాబు.. అల్లు అర్జున్.. ప్రభాస్.. చరణ్ వంటి హీరోలను ప్రత్యేకంగా స్టయిలిష్ అని చెప్పక్కర్లేదు. వారు అలాగే ఉంటారు. కాకపోతే ఇప్పుడు స్పైడర్ అనే ప్రయత్నం మాత్రం హిట్టయ్యిందంటే టాలీవుడ్ ను కొత్త మెట్టు ఎక్కిస్తుంది. ఇదే టీజర్ పై రాజమౌళి కామెంట్ చూడండి.. ''స్పైడర్ అని ఎందుకు పేరు పెట్టారో ఇప్పుడు అర్దమైంది. చాలా ఆసక్తికరంగా ఉంది'' అన్నాడు. దటీజ్ పర్ఫెక్ట్ కామెంట్.. కాదంటారా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/