Begin typing your search above and press return to search.
కలకలం: ఆ ట్రావెల్ బస్సులో స్పైడర్ షో!
By: Tupaki Desk | 1 Oct 2017 4:41 AM GMTపైరసీ సినిమాను చంపేస్తుందంటూ ఓపక్క పెద్ద ఎత్తున ఆందోళన నడుస్తున్నా.. అలాంటి వాటిని అస్సలు పట్టించుకోకుండా షో పడిన గంటలకే బయటకు వచ్చేయటం తెలిసిందే. ఇటీవల విడుదలైన స్పైడర్ మూవీ ప్రింట్ కూడా బయటకు వచ్చేసింది.
భారీ ఎత్తున నిర్మించిన స్పైడర్ మూవీకి పైరసీ ఎంత భారీగా ఉందంటే.. ఈ మూవీ సీడీలు ఆన్ లైన్లోలోనూ.. ఆఫ్ లైన్లోనూ హల్ చల్ చేస్తున్నాయి. మహేశ్ బాబు లాంటి పెద్ద హీరో సినిమా కావటం..అందునా మురుగదాస్ వంటి దర్శకుడితో చేయటంతో ఈ మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. కాకుంటే.. ఈ సినిమా మీద మిక్స్‌డ్ టాక్ నడుస్తున్న వేళ.. బయటకొచ్చిన పైరసీ పుణ్యమా అని సినిమాకు భారీ నష్టం వాటిల్లనుంది.
పైరసీ ఎంత భారీగా ఉందన్న మాటకు నిదర్శనంగా తాజాగా ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సులో స్పైడర్ మూవీని వేయటం కలకలం రేపింది. గుంటూరు నుంచి విశాఖపట్నం వెళుతున్న వెంకటరమణ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో పెన్ డ్రైవ్ ద్వారా స్పైడర్ మూవీని వేశారు. ఈ విషయాన్ని ఓ ప్రయాణికుడు కంట్రోల్ రూమ్‌కు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.
దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్లో బస్సును నిలిపి మరీ తనిఖీలు నిర్వహించారు. స్పైడర్ మూవీని వేసినట్లుగా ప్రాథమిక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. దీంతో.. మరో బస్సును తీసుకొచ్చి ప్రయాణికుల్ని అందులో పంపించేశారు. బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఉదంతంపై విచారిస్తున్నారు. స్పైడర్ మూవీ వేసిన నేరానికి ఎవరి మీద కేసు నమోదు చేశారన్న విషయంపై సమాచారం అందాల్సి ఉంది.