Begin typing your search above and press return to search.

రొమానియాలో మహేశ్ రొమాన్స్!!

By:  Tupaki Desk   |   27 July 2017 5:09 AM GMT
రొమానియాలో మహేశ్ రొమాన్స్!!
X
స్పైడర్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చి కొన్ని నెలలు అయిన ఆ సినిమాకు సంబంధం ఉన్న మరే ఇతర విషయాలు బయటపడలేదు. స్పైడర్ సినిమా షూటింగ్ మొత్తం అయిపోవడంతో ఆ సినిమా టీజర్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు టీమ్. ఆగష్టు 9న మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా స్పైడర్ సినిమా టీజర్ ను విడుదల చేస్తునట్లు ఆల్రెడీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక పాట పెండింగ్ ఉంది.

ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో బ్యాలెన్స్ ఉన్న ఒక పాట షూటింగ్ కోసం రొమేనియా వెళుతున్నారు. ఆగష్టు 2 నుండి 8 వరకు ఈ పాట షూటింగ్ సదరు యురోపియన్ దేశంలో జరగబోతుంది. ఈ పాటలో మహేష్‌ అండ్ రకుల్ ప్రీత్ రొమాన్స్ అదిరిపోతుందని ఒక టాక్. ఇప్పటివరకు చాలా యురోపియన్ దేశాల్లో చాలాసార్లు షూటింగ్ చేసిన మహేష్‌.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాటల కోసం మాత్రం ఫారిన్ వెళ్లట్లేదు. వెళ్ళినా కూడా ఒకటి లేదా రెండు పాటల కోసమే. కారణాలు పెద్దగా లేవు కాని.. ఎందుకోగాని ఫారిన్ లో షూటింగ్ తగ్గించేశాడు. కాని స్పైడర్ సినిమా విషయంలో మాత్రం.. సినిమాలో పాటలకంటే కూడా యాక్షన్ పార్టును ఫారిన్ లో షూట్ చేయడం విశేషం.

ఇకపోతే స్పైడర్ ను సెప్టెంబరు 27న విడుదల చేయడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో పాటుగా తమిళనాడులో కూడ విడుదల కాబోతుంది. ఈ సినిమాతో పాటుగా మహేశ్ బాబు ఇప్పుడు మరో సినిమా కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న భరత్ అనే నేను షూటింగ్ తో బిజీగా ఉన్నాడు మహేష్. ఈ సినిమాలో పోలిటికల్ లీడర్ గా యువ ముఖ్య మంత్రిగా నటించబోతున్నాడు.