Begin typing your search above and press return to search.

శ్రీమంతుడు ఇంటర్వెల్లో ఏముంది?

By:  Tupaki Desk   |   15 July 2015 12:22 PM GMT
శ్రీమంతుడు ఇంటర్వెల్లో ఏముంది?
X
బాహుబలి ఫీవర్ నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ఇక హంగామా అంతా శ్రీమంతుడిదే. ఈ నెల 18న ఆడియో ఫంక్షన్‌తో మహేష్ అభిమానుల సందడి మొదలైపోతుంది. ఆ తర్వాత 20 రోజుల పాటు ప్రమోషన్ కార్యక్రమాలు భారీగానే ప్లాన్ చేశారని సమాచారం. ఇప్పటికే రిలీజైన మహేష్ పోస్టర్లు అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చాలా ప్లెజెంట‌్‌గా అనిపిస్తున్న ఈ పోస్టర్లు ఫ్యాన్స్‌ను మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్‌ను కూడా భలేగా ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి పోస్టర్లు మరిన్ని వదలాలని చూస్తున్నట్లు సమాచారం. ఆడియో ఫంక్షన్లో థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజవుతుంది. ఆ తర్వాత తక్కువ నిడివిలో కొన్ని టీజర్లు కూడా సందడి చేయబోతున్నాయి. మొత్తానికి విడుదల సమయానికి క్రేజ్ పీక్స్‌కు చేరుకునేలా ప్లాన్ రెడీగా ఉంది.

సినిమాలో హైలైట్లు చాలానే ఉన్నాయని.. ముఖ్యంగా మహేష్ క్యారెక్టరైజేషన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. శ్రీమంతుడిగా నటిస్తున్న మహేష్ సినిమా అంతటా రాయల్ లుక్‌లోనే దర్శనమిస్తాడని అంటున్నారు. ఇంటర్వెల్‌కు ముందు ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉందని.. మహేష్ సినిమాల్లో ఇప్పటిదాకా ఎన్నడూ అలాంటి యాక్షన్ సీక్వెన్స్ చూసి ఉండరని.. అది చూసి ప్రేక్షకులు స్టన్ అవడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి ఇలాంటి వార్తలు మహేష్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. తమ హీరో ఈసారి బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయమన్న ఫీలింగ్‌లో ఉన్నారు ఫ్యాన్స్.