Begin typing your search above and press return to search.
మహేష్ ఆపేశాడు.. బాలయ్యే ఆపట్లేదు
By: Tupaki Desk | 7 April 2016 5:30 PM GMTవంద రోజుల ముచ్చట ఇప్పుడు లేనే లేదు. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా విడుదలైన రెండు మూడు వారాల్లోనే సర్దేస్తోంది. ఓపెనింగ్స్ లెక్కలు చూసుకొంటూ అవే రికార్డులుగా భావిస్తుంటారు అభిమానులు. అయితే బాలకృష్ణ అభిమానులు మాత్రం ఇప్పటికీ వంద రోజులు, రెండొందల రోజులు అంటూ లెక్కలు చూపిస్తున్నారు. బాలయ్య నటించిన లెజెండ్ చిత్రం కనీ వినీ ఎరుగని రీతిలో 750 రోజులుగా ఆడుతూనే ఉంది. ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్లో ఇప్పటికీ ఆ సినిమా ఆడుతూనే ఉంది. అదే సినిమా ఎమ్మిగనూరులో 450రోజులకిపైగా ఆడింది. అందుకే బాలకృష్ణ ఎమ్మిగనూరుకి వెళ్లి ఓ పెద్ద ఫంక్షన్ కూడా చేసొచ్చాడు.
ఎమ్మిగనూరులో బాలకృష్ణ సినిమానే కాదండోయ్... మహేష్ సినిమా కూడా సెంచరీలు కొట్టేసింది. మహేష్ శ్రీమంతుడు సినిమాని అక్కడ 248రోజులు ఆడించారు. బాలయ్య రికార్డుని బద్దలు కొట్టేలా కనిపించారు కానీ... ఏవో కొన్ని అనివార్య కారణాలవల్ల ఆసినిమాని గురువారం తీసేశారు. అలా మహేష్ ఆపేశాడు కానీ... బాలయ్య మాత్రం ఇప్పటికీ జోరు మీదే ఉన్నాడు. బాలయ్య వెయ్యి రోజుల రికార్డులు బద్దలు కొడతాడేమో చూడాలి. అయితే ఎమ్మిగనూరులో మహేష్ సినిమాని తీసేయడానికి కారణం పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్‌సింగ్ అంటున్నారు. శ్రీమంతుడు ఆడుతున్న థియేటర్లో సర్దార్ గబ్బర్ సింగ్ వేయాలని డిసైడ్ అవడంతో ఆ సినిమాని తీసేయక తప్పలేదని తెలిసింది. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో వారం రెండు వారాలకి మించి కలెక్షన్లు ఉండవు. కానీ వందల రోజులు ఎలా ఆడిస్తున్నారో అర్థం కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.