Begin typing your search above and press return to search.

మ‌హేష్ సినిమాకి డాల‌ర్ల పంట‌!

By:  Tupaki Desk   |   10 Aug 2015 4:22 AM GMT
మ‌హేష్ సినిమాకి డాల‌ర్ల పంట‌!
X
ఓవ‌ర్సీస్‌ లో మ‌హేష్‌ కి తిరుగులేదు. ఒక ర‌కంగా చెప్పాలంటే అటువైపు మ‌న మార్కెట్ ఇంత‌గా ఊపందుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌హేషే. `ఒక్క‌డు` నుంచి మ‌హేష్ ఓవ‌ర్సీస్‌ లో డాల‌ర్ల వేట కొన‌సాగిస్తున్నాడు. ఇప్ప‌టిదాకా ఆయ‌న న‌టించిన ఐదు చిత్రాలు యు.ఎస్‌.లో మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ వ‌సూళ్ల‌ని సొంతం చేసుకొన్నాయి. అందుకే మ‌హేష్‌ ని మ‌హేష్‌ బాబు అని కాకుండా డాల‌ర్ బాబు అని పిలుస్తుంటాయి ఓవ‌ర్సీస్ మార్కెట్ వ‌ర్గాలు. మొన్న విడుద‌లైన `శ్రీమంతుడు` కూడా విదేశాల్లో అద‌ర‌గొడుతోంది. అమెరికాలో రెండు మిలియ‌న్ డాల‌ర్ల‌ ను సొంతం చేసుకొంది. సినిమా విడుద‌లైన రెండో రోజే ఆ మార్క్ అందుకోవ‌డం విశేషం.

`బాహుబ‌లి` త‌ర్వాత ఓవ‌ర్సీస్‌ లో 2 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసిన చిత్రం `శ్రీమంతుడు` మాత్ర‌మే. సినిమా జోరు చూస్తుంటే `బాహుబ‌లి`లాగే నాలుగు మిలియ‌న్ డాల‌ర్లు కొట్టేస్తుందేమో అనిపిస్తోంది. `శ్రీమంతుడు`కి ఇంటా బ‌య‌టా మంచి స్పంద‌న వ‌స్తుండ‌టంతో మ‌హేష్ అభిమానులు పండ‌గ చేసుకొంటున్నారు. రెండు వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత వ‌చ్చిన ఈ చిత్రం అభిమానుల‌ను పూర్తిస్థాయిలో మెప్పించింది. ఆ విష‌యంలో మ‌హేష్ హ్యాపీగా ఉన్నాడు. నిన్న త‌న పుట్టిన‌రోజుని విజ‌యోత్సాహం మ‌ధ్య జ‌రుపుకొన్నారు. హైద‌రాబాద్‌ లోనే కుటుంబ స‌భ్యుల మ‌ధ్య పుట్టిన‌రోజు వేడుక‌ల జ‌రిగాయి. ఇక త్వ‌ర‌లోనే `బ్ర‌హ్మోత్స‌వం`కోసం రంగంలోకి దిగ‌బోతున్నాడు మ‌హేష్‌.