Begin typing your search above and press return to search.
మహేష్ 25: కౌంట్ డౌన్ గ్రాండ్ గా మొదలైంది
By: Tupaki Desk | 4 Aug 2018 1:33 PM GMTప్రతిష్టాత్మకమైన తన 25వ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. అభిమానుల దృష్టంతా ఆ సినిమా మీదే. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తోంది మహేష్ కొత్త లుక్. ఈ చిత్రం కోసం ఆయన లైట్ గా గెడ్డం పెంచేశాడు. కాలేజీకి వెళ్లే పాత్ర కావడంతో మరింత యంగ్‌గా కూడా కనిపిస్తున్నాడు. ఇవన్నీ చూసి అభిమానులు సినిమా గురించి ఆత్రుతగా మాట్లాడుకుంటున్న టైమ్ లోనే మహేష్ బర్త్ డే వస్తోంది. బర్త్ డే అంటే కచ్చితంగా సినిమాకి సంబంధించి ఏదో ఒక సందడితో అభిమానుల్ని సంతృప్తి పరుస్తాయి చిత్రబృందాలు.
అందులో భాగంగానే మహేష్ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నారు. ఆగస్టు 9న మహేష్ బర్త్ డే. ఈ సందర్భంగా లుక్ కోసం కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. ఈ రోజే మహేష్ కూతురు సితార - వంశీ పైడిపల్లి కూతురు ఆద్య కలిసి మహేష్ 25 చిత్రానికి సంబంధించిన ఎంబ్లమ్ ని విడుదల చేశారు. స్టార్ అనే గుర్తులో మహేష్ కనిపిస్తున్నాడు ఆ ఎంబ్లమ్ లో. సూపర్ స్టార్ 25వ చిత్రానికి తగ్గట్టుగానే ఎంబ్లమ్ ముస్తాబైందని అభిమానులు ముచ్చటించుకొంటున్నారు.