Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ 'సర్కారు వారి పాట' నిజమేనా...?
By: Tupaki Desk | 27 May 2020 8:00 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా విడుదలై నాలుగు నెలలు దాటిపోయినా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మహేష్ ఆఫీసియల్ గా ప్రకటించలేదు. మహేష్ నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. నిజానికి మహేష్ 'సరిలేరు..' రిలీజైన వెంటనే తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తాడని అందరూ భావించారు. కానీ దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన కుదరలేదు. అయితే మహేష్ తన కెరీర్లో 27వ చిత్రాన్ని 'గీత గోవిందం' డైరెక్టర్ పరశురామ్ తో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ పరశురామ్ తన తదుపరి మూవీ సూపర్ స్టార్ మహేష్ తో అని ప్రకటించేశాడు. దీంతో ఎట్టకేలకు మహేష్ తదుపరి సినిమా ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది. అంతేకాకుండా మహేష్ తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ నెల 31న ఈ సినిమా అఫీసియల్ గా ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే గత కొన్నేళ్లుగా మహేష్ మే 31న తన సినిమాకి సంభందించి ఏదొక అప్డేట్ ఇస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున పూజా కార్యక్రమాలతో లాంఛనంగా షూటింగ్ స్టార్ట్ అవ్వనుందని న్యూస్ వచ్చింది. దీంతో అంభిమానులందరూ మే 31 కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మహేష్ - పరశురామ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాకి 'సర్కారు వారి పాట' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. మహేష్ సినిమాలకి టైటిల్స్ క్యాచీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు 'సర్కారు వారి పాట' అనే టైటిల్ కూడా కొత్తగా ఉంది. మరి మహేష్ 27 అండ్ టీమ్ ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తారేమో చూడాలి. ఇదిలా ఉండగా ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎంబీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయట. అంతేకాకుండా ఈ సినిమాకి ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించనున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. థమన్ 'అల వైకుంఠపురంలో' సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించి ఆ చిత్ర విజయంలో మెయిన్ రోల్ ప్లే చేసాడు. అందుకే మహేష్ కూడా థమన్ కే ఓట్ వేసాడట. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.