Begin typing your search above and press return to search.
స్టూడెంట్ మహర్షి గురించి ఏమంటారో?
By: Tupaki Desk | 7 May 2019 10:40 AM GMTమహర్షి కౌంట్ డౌన్ గంటల్లోకి వచ్చేసింది. అడ్వాన్సు బుకింగ్స్ మహా జోరుగా ఉన్నాయి. స్టార్ హీరో సినిమా వచ్చి మూడు నెలలు దాటడం అందులోనూ ఇది మహేష్ బాబు మూవీ కావడంతో అంచనాలకు బ్రేకులు లేకుండా పోయాయి. ట్రైలర్ తర్వాత అవి ఇంకా పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా మహర్షి టీం రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ చాలా రిస్క్ చేసి తీసిన కాలేజీ ఎపిసోడ్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్న దాని మీద ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
పైగా అది పది పదిహేను కాదు ఏకంగా 45 నిమిషాల పాటు వచ్చే బ్లాక్. ఫస్ట్ హాఫ్ లోనే ఉంటుంది కాబట్టి సెకండ్ హాఫ్ మీద ఆసక్తి రేపాల్సిన భారం దీని మీదే ఎక్కువగా ఉంటుంది. అందుకే మహేష్ సైతం ఇంటర్వ్యూలో ఈ కాలేజీ బ్యాక్ డ్రాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాడు. మహేష్ ని ఇలా పుస్తకాలు పట్టుకుని కాలేజీకి వెళ్ళే పాత్రలో చూసి ఏళ్ళు దాటింది. అందుకే లుక్ పరంగా టీం తీసుకున్న జాగ్రత్త చాలా హెల్ప్ అయ్యింది. మీసకట్టుతో మహేష్ వయసుని తగ్గించి చూపడంలో వంశీ సక్సెస్ అయ్యాడు.
ఇప్పుడు ఆ ఎపిసోడ్ కనక వర్క్ అవుట్ అయితే రెస్పాన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా. పైగా రెండు పాటలు కూడా ఇందులోనే వస్తాయి. సో మహర్షి విద్యార్ధిగా ఎలా మెప్పిస్తాడు అనే దాని గురించి ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఉన్నారు. హైదరాబాద్ లో యధావిదిగా 8.45 నుంచి షోలు మొదలుకానుండగా ఎపిలో తెల్లవారుఝాము నుంచి వేస్తారా లేదా అనే దాని గురించి క్లారిటీ ఇంకా రాలేదు. మరికొద్ది గంటల్లో అనుమతులు వచ్చాయా లేదా తేలిపోతుంది