Begin typing your search above and press return to search.
మహేష్ టార్గెట్.. 60 కోట్ల షేర్
By: Tupaki Desk | 6 Aug 2015 7:59 AM GMTఒకటికి రెండు పెద్ద ఫ్లాపులు తిన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయినా మనోడి మార్కెట్ పెద్దగా డ్యామేజ్ ఏమీ కాలేదు. ఆ రెండు సినిమాల కంటే కూడా ‘శ్రీమంతుడు’కి బిజినెస్ ఎక్కువే జరిగింది. థియేట్రికల్ రైట్స్, మిగతా ఆదాయం కలుపుకుంటే రూ.80 కోట్ల దాకా రాబట్టి రిలీజ్ కు ముందే శ్రీమంతుడు టైటిల్ కు న్యాయం చేశాడు మహేష్. ఐతే గత రెండు సినిమాల విషయంలోనూ మహేష్ మార్కెట్ కు మించి బిజినెస్ చేసిన 14 రీల్స్ వాళ్లు దారుణమైన దెబ్బలు తిన్నారు. 1 నేనొక్కడినే సినిమా బిజినెస్ రూ.60 కోట్లు దాటగా.. వసూలైంది రూ.40 కోట్ల లోపే. ఆ తర్వాత ‘ఆగడు’ కూడా అంతే బిజినెస్ చేసింది. కానీ వసూళ్లు రూ.34 కోట్ల దగ్గరే ఆగిపోయాయి.
ఇప్పుడు శ్రీమంతుడు విషయానికొస్తే బిజినెస్ విషయంలో నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిందీ సినిమా. బాహుబలి స్పెషల్ మూవీ కాబట్టి దాన్ని పక్కనబెట్టేస్తే.. ప్రతి ఏరియాలోనూ రికార్డు రేటు పలికాడు శ్రీమంతుడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.42 కోట్ల దాకా బిజినెస్ చేసిన ‘శ్రీమంతుడు’ కర్ణాటకలో రూ.6 కోట్లు తెచ్చాడు. ఓవర్సీస్ రూ.8 కోట్లు పలికాయి. తమిళ వెర్షన్ రూ.3 కోట్లు వచ్చాయి. శాటిలైట్ రైట్స్ రెండు వెర్షన్లలో కలిపి రూ.14 కోట్లు పలికాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ ఇంకో ఐదు కోట్లకు అమ్మారు. మొత్తంగా అన్ని మార్గాల్లో కలిపి రూ.79 కోట్లు అందుకున్నారు శ్రీమంతుడు నిర్మాతలు. ఐతే శ్రీమంతుడు హిట్ అనిపించుకోవాలంటే షేర్ రూపంలోనే రూ.60 కోట్లు రాబట్టాలి. గ్రాస్ వసూళ్లు రూ.90 కోట్ల మార్కును అందుకోవాలి. ఇది ఎలా చూసినా సవాలే. సినిమాకు హిట్ టాక్ వస్తే అదేమీ పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ 1, ఆగడు లాగా ఏమైనా తేడా వస్తే మాత్రం అంతే సంగతులు.