Begin typing your search above and press return to search.
మహేష్ బాబు టీం మొదలెట్టిందిగా..
By: Tupaki Desk | 13 Dec 2017 8:32 AM GMTహీరోగా మహేష్ బాబు ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మహేష్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ షేకైపోతుంది. వసూళ్ల మోత మోగుతుంది. రికార్డులు బద్దలవుతాయి. కానీ మహేష్ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా కూడా ఎఫెక్ట్ అదే స్థాయిలో ఉంటోంది. డిజాస్టర్ల రికార్డులు బద్దలైపోతున్నాయి. అతడి సినిమాలకు ఒక స్థాయికి మించి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. ‘బ్రహ్మోత్సవం’.. ‘స్పైడర్’ సినిమాల విషయంలో ఏం జరిగిందో అందరూ చూశారు. ఈ సినిమాలు మరీ ఆ స్థాయిలో డిజాస్టర్లవుతాయని ఎవరూ అనుకోలేదు.
మహేష్ బాబుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారాలు మరీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయని.. దీన్ని కంట్రోల్ చేసే టీం మహేష్ దగ్గర లేదని.. సోషల్ మీడియాను మేనేజ్ చేసే.. మహేష్ సినిమాలకు ఇక్కడ సరైన ప్రమోషన్ చేయించే టీం అవసరముందని చాలామంది ఇటీవల అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే మహేష్ ఒక సోషల్ మీడియా టీంను సెట్ చేసుకున్నాడు. ఆ టీం మహేష్ సినిమాలకు సంబంధించి నెగెటివిటీని తగ్గించే పని ఇప్పటికే మొదలుపెట్టింది.
మహేష్ కొత్త సినిమా ‘భరత్ అను నేను’ నుంచి సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్ తప్పుకోవడంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు కొరటాల శివతో విభేదాల వల్లే ఆయన తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. దీన్ని ఖండిస్తూ మహేష్ బాబు ట్విట్టర్ టీం స్పష్టత ఇచ్చింది. ముందే ఫిక్సయిన కమిట్మెంట్ల కోసమే రవి.కె.చంద్రన్ వెళ్లారని.. మిగతా షూటింగ్ తిరు చేస్తారని ప్రకటించారు. ‘భరత్ అను నేను’ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని ముందు అనుకున్న సంగతి తెలిసిందే. ఆ ప్రకారం డిసెంబరు వరకే రవితో కమిట్మెంట్ తీసుకున్నారట. ఐతే షూటింగ్ ఆలస్యం కావడం.. సినిమా ఏప్రిల్ కు వాయిదా పడటంతో రవి వెళ్లిపోవాల్సి వచ్చిందని.. అంతే తప్ప ఇక్కడ విభేదాలంటూ ఏమీ లేవని మహేష్ బాబు టీం స్పష్టత ఇచ్చింది.