Begin typing your search above and press return to search.
మహేష్ పంచ్ సుకుమార్ కే అంటున్నారే!
By: Tupaki Desk | 1 May 2019 5:58 PM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం జరిగింది. మహేష్ కెరీర్లో 25 వ చిత్రం కావడంతో మహేష్ కొంచెం ఎమోషనల్ గా కనిపించాడు. తనదైన స్టైల్ లో కొన్ని జోకులు వేశాడు. పనిలో పనిగా ఈకాలం డైరెక్టర్ల తీరుపై ఒక స్ట్రాంగ్ పంచ్ కూడా వేశాడు.
'మహర్షి' దర్శకుడు వంశీ పైడిపల్లి గురించి మాట్లాడుతూ "వంశీ నాకు తమ్ముడి లాంటివాడు. నేను మొదటి సారి కథ విన్నప్పుడు నేను ఓ పది నిముషాలు కథ విని వంశీని పంపేద్దామని అనుకున్నాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ రెండు మూడు సినిమాలు కమిట్ మెంట్స్ ఉన్నాయి. ఈ సినిమా చేసే సమయం ఉండదని అలా అనుకున్నాను. కానీ వంశీ నేరేషన్ 20 నిముషాలు వినగానే నేను ఈ సినిమా చేయాలంటే ముందు రెండు సినిమాలు చేయాలి.. అ తర్వాతే కుదురుతుంది అని వంశీ తో చెప్పాను. 'నో ప్రాబ్లెం సర్. రెండేళ్ళయినా మీకోసం వెయిట్ చేస్తాను. ఎందుకంటే మీరు తప్ప ఈ కథలో నేను వేరే ఎవరినీ ఊహించలేను అన్నాడు. ఆ విషయంలో నీకెప్పుడూ రుణపడి ఉంటాను వంశీ. ఈరోజుల్లో ఏ డైరెక్టర్ దగ్గరయినా కథ ఉంటే ఒక టూ మంత్స్ డిలే అయినా వేరే హీరోల దగ్గరకు వెళ్ళిపోతారు. కానీ అలా కాకుండా నాకోసం రెండేళ్ళు వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ వంశీ. నిజానికి వంశీ రెండేళ్ళు కాదు.. మూడేళ్ళు వెయిట్ చేశాడు" అంటూ ముగించాడు.
రెండు నెలలు డిలే అయినా కథను వేరే హీరో దగ్గరకు తీసుకెళ్తారని మహేష్ ఇండైరెక్ట్ గా వేసిన స్ట్రాంగ్ పంచ్ డైరెక్టర్ సుకుమార్ మీదేనని ఆల్రెడీ సోషల్ మీడియాలో కామెంట్స్ పడిపోతున్నాయి. 'రంగస్థలం' విజయం తర్వాత మైత్రీ వారు సుకుమార్ -మహేష్ బాబు కాంబో సెట్ చేశారు. కానీ ఈమధ్య మహేష్-అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఫైనలైజ్ కావడంతో సుకుమార్ బన్నీని అప్రోచ్ కావడం వారిద్దరి కాంబో లో సినిమా ప్రకటించడం తెలిసిన విషయాలే. అనిల్ రావిపూడి సినిమా తో పాటూ సుకుమార్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సుకుమార్ వెయిట్ చెయ్యకుండా అల్లు అర్జున్ సినిమాకు రెడీ అవ్వడం మహేష్ ను ఇబ్బంది పెట్టిందని వార్తలు వచ్చాయి. అప్సెట్ అయిన మహేష్ వారి సినిమాకు కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేయడం పెద్ద హాట్ టాపిక్ అయింది. తర్వాత సుకుమార్ మహేష్ ను కలిసి సయోధ్య కోసం ట్రై చేసినట్టు వార్తలు వచ్చాయి కానీ మహేష్ మాత్రం ఆ విషయం సీరియస్ గా తీసుకున్నట్టు మహర్షి ఈవెంట్ లో వేసిన పంచ్ ఒక ఉదాహరణ అనే అభిప్రాయం వినిపిస్తోంది. మహేష్ సాఫ్ట్ గా వేసినా పంచ్ మాత్రం గట్టిగా పడ్డట్టేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి.