Begin typing your search above and press return to search.
బర్త్ డే నాడు మొక్కలు నాటిన మహేష్ కి ఫైన్..!
By: Tupaki Desk | 9 Aug 2020 11:49 AM GMTనేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, అభిమానులు అందరూ పెద్ద ఎత్తున ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. కరోనా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని.. అభిమానులు క్షేమంగా ఉండాలని మహేష్ కోరడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సెలబ్రేషన్స్ చేస్తూ.. వరల్డ్ లో బిగ్గెస్ట్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక మహేష్ కూడా తన బర్త్ డే నాడు ఒక మంచి పనిలో పాల్గొనాలన్న ఆలోచనతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. పార్లమెంట్ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో దశలో పార్టిసిపేట్ చేసిన మహేష్.. జూనియర్ ఎన్టీఆర్ - కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ - శృతిహాసన్ లను దీనిని కొనసాగించవలసిందిగా కోరారు.
కాగా మహేష్ బాబు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ''పుట్టినరోజును ఇంతకంటే గొప్పగా సెలబ్రేట్ చేసుకోలేను.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నాను.. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ - విజయ్ - శృతిహాసన్ పాల్గొని దీనిని కంటిన్యూ చేయాలని.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సరిహద్దులు దాటాలని కోరుకుంటున్నాను. పచ్చదనం వైపు మనమందరం అడుగులు వేయాలని కోరుకుంటున్నాను'' అని ట్వీట్ చేశారు. ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ ను మహేష్ బాబు అభినందించారు. ఇదిలా ఉండగా మహేష్ బాబు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటుతున్న సందర్భంలో మాస్కును ధరించలేదు. దాంతో కరోనా నిబంధనల ప్రకారం బహిరంగ ప్రదేశంలో మాస్క్ లేకుండా తిరిగినందుకు ఆయనకు వెయ్యి రూపాయలు జరిమానా విధించేందుకు సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది.