Begin typing your search above and press return to search.
మురుగ మూవీ ముగిస్తున్న మహేష్
By: Tupaki Desk | 9 April 2017 2:35 PM ISTమహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో మూవీ చాలా క్రితమే మొదలైంది. మొదటగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే.. జనవరి నెలాఖరు నాటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయిపోవాల్సి ఉంది సమ్మర్ రిలీజ్ అని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు సమ్మర్ వచ్చేసినా.. ఇప్పటివరకూ ఫస్ట్ లుక్ కాదు కదా.. కనీసం టైటిల్ అనౌన్స్ మెంట్ కూడా రాలేదు. దీంతో అసలు ఈ సినిమా ప్రోగ్రెస్ ఎంతవరకూ వచ్చిందనే టెన్షన్ సూపర్ స్టార్ అభిమానుల్లో చాలానే ఉంది.
వీరందరికీ ఇప్పుడో గుడ్ న్యూస్ వినిపించేయచ్చు. అతి త్వరలోనే మురుగ సినిమా షూటింగ్ ను మహేష్ బాబు ముగించేస్తున్నాడట. ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న షెడ్యూల్ తో.. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోనుందట. ఏప్రిల్ మూడో వారం వరకూ జరగనున్న ఈ లాంగ్ షెడ్యూల్ తో.. కొంత ప్యాచ్ వర్క్ మినహాయిస్తే.. మొత్తం షూట్ కంప్లీట్ కానుందని తెలుస్తోంది. మిగిలిన వర్క్ ని కూడా మే మొదటి నాటికే పూర్తి చేసేయనున్నారని అంటున్నారు.
మహేష్ సినిమా షూటింగ్ పూర్తయిపోతుందని తెలియడం నిజంగా ఫ్యాన్స్ కు పండగే అనాల్సిందే. ఎందుకంటే అసలు టైటిల్ కూడా చెప్పని సినిమా.. నిజంగా జూన్ 23కు విడుదల అవుతుందా అవదా అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ తో.. మహేష్ -మురుగల 'స్పై-డర్' జూన్ 23 రిలీజ్ డేట్ కి ఫిక్స్ అయిపోవచ్చు. మరికొన్ని రోజుల్లోనే ఈ టైటిల్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/