Begin typing your search above and press return to search.
మహేష్ ..ది రియల్ బిజినెస్ మేన్
By: Tupaki Desk | 31 Jan 2019 5:35 AM GMTసూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో `మహర్షి` ప్రస్తుతం ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతోంది. ఆన్ లొకేషన్ నుంచి కొన్ని లీకులు ఇటీవల చిత్రయూనిట్ ని బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. లీకులతో పాటే ఈ సినిమాపై భారీగా హైప్ పెరుగుతోంది. ఈ సమ్మర్ లో మహేష్ ఘట్టమనేని అభిమానులకు బెస్ట్ ట్రీట్ ఇస్తాడనే అంతా ఆశిస్తున్నారు. రైతుగా - స్టూడెంట్ గా - క్రికెటర్ గా విభిన్నమైన గెటప్పుల్లో మహేష్ అలరించనున్నాడని ఇప్పటికే ప్రచారమవుతోంది.
ఈ సినిమా తర్వాత మహేష్ 26 సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. దీంతో పాటే 2019లో మహేష్ మరికొన్ని కొత్త పంథా ప్రణాళికలతో దూసుకురాబోతున్నారని ఇప్పటికే ప్రచారమవుతోంది. మహేష్ - నమ్రత జంట ఇప్పటికే ఏఎంబీ సినిమాస్ పేరుతో థియేటర్ల వ్యాపారంలో అడుగుపెట్టారు. దీంతో పాటే సినిమాల నిర్మాణంలో భాగంగా - చిన్న సినిమాల నిర్మాణం - వెబ్ సిరీస్ ల రూపకల్పన వంటి ప్రణాళికల్లో బిజీగా ఉన్నారు.
లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం .. జియో ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి మూడు సీజన్లకు సరిపడా వెబ్ సిరీస్ రూపకల్పనకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ కి టైటిల్ ని ఫైనల్ చేశారని తెలుస్తోంది. చార్లీ అండ్ నాన్నకు ప్రేమతో అనేది ఈ వెబ్ సిరీస్ టైటిల్. హుసేన్ షా కిరణ్ అనే రచయిత ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించనున్నారు. 24 ఎపిసోడ్లుగా తెరకెక్కే ఈ సిరీస్ పూర్తిగా థ్రిల్లర్ ఫార్మాట్ లో రూపొందనుంది. ఇది కేవలం తెలుగు ఆడియెన్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని రూపొందించలేదని - పాన్ ఇండియా బేసిస్ లో తెలుగు - తమిళం - హిందీ - కన్నడ - మలయాళ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ రూపకల్పన చేయనున్నారట. మహేష్ ప్రస్తుతం వరుసగా సినిమా కమిట్ మెంట్లతో బిజీగా ఉన్నారు కాబట్టి వెబ్ సిరీస్ రూపకల్పనపై నమ్రత అన్ని విధాలా తనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. మొత్తానికి ఒక్కో బిజినెస్ లో అడుగుపెడుతూ మహేష్ `ది రియల్ బిజినెస్ మేన్` అని నిరూపిస్తున్నాడు.