Begin typing your search above and press return to search.
కామెడీ సీన్లన్నీ లేపేశారటగా!!
By: Tupaki Desk | 18 May 2016 11:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాడో.. చూస్తూనే ఉన్నాం. ఆడియో ఫంక్షన్ లోనే అన్నీ తానై వ్యవహరించిన కళ్లారా కనిపించింది. రీసెంట్ గా నిర్మాత పీవీపీ కూడా అందరికంటే ఎక్కువగా ఈ సినిమా కోసం మహేష్ కష్టపడ్డాడని చెప్పడంతో.. సూపర్ స్టార్ ఈ మూవీపై ఎంత ఫోకస్ చేశాడో అర్ధమవుతుంది. ఇప్పుడు బ్రహ్మోత్సవం విషయంలో ఓ కీలకమైన విషయం బయటకొచ్చింది.
సినిమా నిడివి 2 గంటల 36 నిమిషాలు అని ముందే చెప్పుకున్నాం. ఇంత పొదుపుగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించడం ఆశ్చర్యం కలిగించింది కూడా. అయితే.. బ్రహ్మోత్సవం అసలు డ్యురేషన్ 2 గంటల 48 నిమిషాలు వచ్చిందట. కానీ ఇంత లెంగ్త్ అంటే బోర్ కొట్టేస్తుందని భావించాడట మహేష్. అందుకే మహేష్ దగ్గరుండి కొన్ని కత్తెరలు వేయించాడట. ముఖ్యంగా సెకండాఫ్ లో పలు కామెడీ సీన్లు కత్తిరించేశాడట మహేష్. క్రిస్ప్ గా పర్ఫెక్ట్ ప్యాకేజీ అనిపించాలంటే ఈ కామెడీ సన్నివేశాలు అనవసరం అని భావించాడట మహేష్.
కేవలం డ్యురేషన్ ని దృష్టిలో పెట్టుకుని 12 నిమిషాల సీన్స్ ని నిర్దాక్షిణ్యంగా కట్ చేశాడట మహేష్. అలా బ్రహ్మోత్సవం నిడివి 2 గంటల 36 నిమిషాలు అయ్యింది. మొత్తానికి బ్రహ్మోత్సవం విషయంలో మహేష్ ఎందులోనూ ఛాన్స్ తీసుకోవడం లేదు.