Begin typing your search above and press return to search.

'పోకిరి' లుక్ కోసం మహేష్ స్పెష‌ల్ కేర్...!

By:  Tupaki Desk   |   26 Oct 2020 5:00 PM GMT
పోకిరి లుక్ కోసం మహేష్ స్పెష‌ల్ కేర్...!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''సర్కారు వారి పాట''. 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ ఐదు నెలల గ్యాప్ తీసుకొని ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయలేకపోయాడు. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ చిత్రానికి పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి నుంచి సెట్స్ మీద‌కి తీసుకెళ్లడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, 'సర్కారు వారి పాట'లో మహేష్ క్యారక్టరైజేషన్.. మేనరిజం నెవర్ బిఫోర్ అనే విధంగా ఉండబోతోందని తెలుస్తోంది. దీనికి తగ్గట్టే ఫుల్ అవుట్ అండ్ అవుట్ ర‌గ‌డ్ ర‌ఫ్ లుక్ లో క‌నిపించ‌బోతున్నాడు మహేష్. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ లో ఫుల్ హెయిర్.. చెవికి రింగు.. రఫ్ గా కనిపించేలా గడ్డం.. మెడ మీద రూపాయి కాయిన్ టాటూతో మహేష్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి.

'సర్కారు వారి పాట'లో మహేష్ బాబు లుక్ 'పోకిరి'లో ఫుల్ హెయిర్ తో ఉండే పండుగాడి మాదిరిగా ఉండబోతోంది. హెయిర్ గ్రోత్ కోసం మ‌హేశ్ దాదాపుగా రెండు నెలలు స్పెష‌ల్ కేర్ తీసుకొని నేచురల్ గా క‌నిపించ‌బోతున్నాడని స‌మాచారం. గత కొంతకాలంగా మాస్ లుక్ కి దూరంగా ఉన్న మహేష్.. ఈ సినిమాతో ఆ లోటును తీర్చబోతున్నాడని తెలుస్తోంది. మహేష్ బాడీ లాంగ్వేజ్ లో డైలాగ్ డెలివరీలో ఇంతకముందు చూడని వేరియేషన్ ని చూపించబోతున్నాడు. సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న 'సర్కారు వారి పాట' పై అటు మహేష్ ఫ్యాన్స్ లోనూ ఇటు సినీ అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో మహేష్ కి జోడీగా 'మహానటి' కీర్తి సురేష్ నటించనుంది. థమన్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.