Begin typing your search above and press return to search.
మామకు సరిలేరు కనెక్షన్.. అయినా పొగిడారు!
By: Tupaki Desk | 17 Dec 2019 8:17 AM GMTవిక్టరీ వెంకటేష్-నాగచైతన్య కథానాయకులుగా నటించిన మల్టీస్టారర్ `వెంకీ మామ` ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. డే వన్ లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగులు ఫర్వాలేదని టాక్. వెంకీ ఇమేజ్.. చై పరిణతి చెందిన నటన సినిమాకు కలిసొచ్చాయని చెబుతున్నారు. అయితే అదుపుతప్పిన బడ్జెట్ తోనే అసలు చిక్కు. అంత పెద్ద వసూళ్లు వెంకీమామ రాబట్టగలడా? అన్నది ఇప్పటికి సస్పెన్స్ గా మారింది.
తాజాగా వెంకీమామకు సూపర్ స్టార్ మహేష్ ట్విటర్ వేదికగా కాంప్లిమెంట్ ఇచ్చారు. మామ-అల్లుళ్లపై తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసాను. మామ అల్లుళ్ల కెమిస్ట్రీ బాగుంది. కామెడీ.. ఎమోషన్స్.. ఫ్యామిలీ సీన్స్ బాగా కనెక్ట్ అయ్యాయని మహేష్ ట్వీట్ చేసారు. సాధారణంగా మహేష్ తెలుగు సినిమాల గురించి చాలా రేర్ గా స్పందిస్తారు. తను బాగా కనెక్ట్ అయితే తప్ప ఓపెన్ కారు. అలాంటింది విమర్శకులు తీర్పుతో సంబంధం లేకుండా మహేష్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం ఆశ్చర్యంగానే అనిపిస్తోంది.
ప్రస్తుతం మహేష్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ప్రచార చిత్రాలను బట్టి అనీల్ మార్క్ చిత్రంలానే అనిపిస్తోంది. ఓ వైపు యాక్షన్ ఎలివేట్ చేస్తూనే తనదైన శైలి కామెడీకి పెద్ద పీఠ వేసినట్లు తెలుస్తోంది. వెంకీమామ కు- సరిలేరు కు చిన్న పోలిక ఉందనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు మహేష్ ప్రశంసలకు ఆ కామెంట్లకు కనెక్షన్ ఏదైనా ఉందా? అంటూ ఫ్యాన్స్ ఆరాలు తీస్తున్నారు. ఇక వెంకీతో కలిసి మహేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ స్నేహం ఇప్పటికీ అలానే కొనసాగుతోంది.