Begin typing your search above and press return to search.

మెగాస్టార్ `భోళా శంక‌ర్` టైటిల్ ని ఆవిష్క‌రించిన మ‌హేష్

By:  Tupaki Desk   |   22 Aug 2021 4:11 AM GMT
మెగాస్టార్ `భోళా శంక‌ర్` టైటిల్ ని ఆవిష్క‌రించిన మ‌హేష్
X
మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ ద‌ర్శ‌కుల్ని క‌థ‌ల్ని ఫైన‌ల్ చేసి వ‌రుస‌గా సినిమాల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వంద రోజుల ముందే మెగాభినులు గుడులు గోపురాల్లో పూజ‌లు పున‌స్కారాలు ప్రారంభించ‌గా.. నేడు ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా సినిమాల టైటిల్స్ ని ఆవిష్క‌రిస్తున్నారు.

చిరంజీవి- మెహ‌ర్ ర‌మేష్ కాంబినేష‌న్ మూవీకి భోళా శంక‌ర్ టైటిల్ ని ఛాంబ‌ర్ లో రిజిస్ట‌ర్ చేయించార‌ని ఇంత‌కుముందే తుపాకి వెల్ల‌డించింది. ఇప్పుడు దానిని అధికారికం చేస్తూ టైటిల్ ని ప్ర‌క‌టించారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ స్వ‌యంగా భోళా శంక‌ర్ టైటిల్ ని లాంచ్ చేయ‌డ‌మే గాక మెగాస్టార్ కి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలిపారు.

``హ్యాపీ బ‌ర్త్ డే చిరంజీవి గారు.. మీ సినిమా టైటిల్ `భోళా శంక‌ర్`ని లాంచ్ చేయ‌డాన్ని గౌర‌వంగా భావిస్తున్నాను. నా గుడ్ ఫ్రెండ్ మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో నా ఫేవ‌రెట్ నిర్మాత అన‌ల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్న‌ మెగాస్టార్ ఆయురారోగ్యాల‌తో గొప్ప విజ‌యాల‌తో ముందుకు కొన‌సాగాల‌ని ఆకాంక్షిస్తూ .. ఆల్ ది బెస్ట్ స‌ర్..`` అంటూ మ‌హేష్ ట్వీట్ చేశారు.

త‌మిళ స్టార్ హీరో త‌ళా అజిత్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ వేదాళంకి అధికారిక రీమేక్ ఇది. ఈ సినిమా స్క్రిప్టుని రెడీ చేసి ఏడాది కాలంగా మెహ‌ర్ ర‌మేష్ బాస్ కోసం వేచి చూస్తున్నారు. మెహ‌ర్ కి తొలుత మ‌హేష్ అవ‌కాశం ఇస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. న‌మ్ర‌త మ‌హేష్ తో క‌లిసి సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించే సినిమాల‌కు ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల్ని ఎగ్జిక్యూట్ చేసే ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కు పేరుంది. ఇప్పుడు మెగాస్టార్ తో సినిమా చేస్తూ ఆ సినిమా టైటిల్ ని మ‌హేష్ తో ఆవిష్క‌రించ‌డం ఆస‌క్తిక‌రం.

మెగాస్టార్ బర్త్ డే రోజున ఘ‌నంగా టైటిల్ ని ఆవిష్క‌రించారు. ఇక విజ‌యంతో మెహ‌ర్ కంబ్యాక్ అవ్వాల‌నే ఇండ‌స్ట్రీ కోరుకుంటోంది. ప్ర‌భాస్ తో బిల్లా రీమేక్ ని ఎంతో స్టైలిష్ గా తెర‌కెక్కించిన మెహ‌ర్ ర‌మేష్ ఆ త‌ర్వాత ఎన్టీఆర్ తో శ‌క్తి- వెంక‌టేష్ తో షాడో లాంటి డిజాస్ట‌ర్ సినిమాల‌ను తెర‌కెక్కించారు. ఆ త‌ర్వాత చాలా గ్యాప్ వ‌చ్చినా ఇప్పుడు మెగా బాస్ ఓ మంచి అవ‌కాశం క‌ల్పించారు. మెహ‌ర్ దీనిని స‌ద్వినియోగం చేసుకుని కంబ్యాక్ అవుతార‌నే ఆకాంక్షిస్తున్నారు. మెగాస్టార్ తో హిట్టు కొట్టి మ‌హేష్ తో ఆఫ‌ర్ ఛేజిక్కించుకుంటార‌నే ఆశిద్దాం.

క‌థాంశం పాత్ర తీరుతెన్నులు:

నిజ జీవితంలో ఎలాంటి కుట్రలు లేకుండా ఒక ప‌సివాడిలా అమాయకత్వం మృధుత్వం క‌ల‌గ‌లిసిన వ్య‌క్తిత్వం చిరంజీవి సొంతం. దయార్ధ్ర‌హృద‌యుడిగా ఆయ‌న సేవ‌లు మ‌రువ‌లేనివి. ఈ సినిమాకి భోళా శంక‌ర్ అనే టైటిల్ నిర్ణ‌యించ‌డానికి కార‌ణం.. శివుడు తన ఉదారత దయత‌లిచే స్వభావం ఉన్న దేవుడు. అందుకే భోలా శంకర్ అని పిలువబడుతున్నారు.. టైటిల్ నిజానికి సినిమాలో కథానాయకుడి మృధువైన హృదయానికి సౌమ్యత‌కు సింబాలిక్ గా నిలుస్తుంది.

టైటిల్ డిజైన్ లో త్రిశూలం.. హౌరా బ్రిడ్జ్ .. కాళీ మాత ఆలయం పోస్టర్ లో ఉత్కంఠ‌ను పెంచుతున్నాయి. మోషన్ పోస్టర్ కోసం మహతి స్వర సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. భోలా శంకర్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌. అనీల్ సుంకర ఎకె ఎంటర్ టైన్ మెంట్స్- క్రియేటివ్ కమర్షియల్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. 2022 లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. రామ‌బ్ర‌హ్మం సుంక‌ర స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.