Begin typing your search above and press return to search.

మహేష్ తో మాట్లాడాలంటే అదే దారి

By:  Tupaki Desk   |   24 April 2021 3:35 AM GMT
మహేష్ తో మాట్లాడాలంటే అదే దారి
X
దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. సామాన్యుడి నుంచి ప్రముఖులు, సెలబ్రిటీల వరకు అందరూ తమదైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనాతో థియేటర్లు సైతం మూతపడ్డాయి. షూటింగ్‌లు సైతం వాయిదా పడుతున్నాయి. ధైర్యం చేద్దామనుకున్నవారికి సైతం కరోనా వార్నింగ్ బెల్స్ మ్రోగిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు,వారి స్టాఫ్ కరోనా బారిన పడగా, వారితో సన్నిహితంగా ఉన్న మరి కొందరు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోతున్నారు. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తలు తీసుకుంటన్నారు. మొహమాటానికి తావివ్వకుండా ముందు తాము, తమ కుటుంబ రక్షణకే ప్రయారిటీ ఇస్తున్నారు. పనులన్ని ఆన్ లైన్ వేదికగా కానిచ్చేస్తున్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారువారి పాట చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా తన పర్సనల్‌ స్టైలిస్ట్‌ కరోనా బారిన పడటంతో అతనితో పాటు మరి కొందరిలోనూ కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో సినిమా షూటింగ్‌ను నిలిపివేసారు. ఈ నేపధ్యంలో ముందు జాగ్రత్తగా మహేష్‌ బాబు క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. గత సంవత్సరం కరోనా సమయంలో ఆయన షూటింగ్ లు ప్రక్కన పెట్టి ఎవరితో మీటింగ్ అయినా ఆన్ లైన్ లోనే జరిపేవారు. ఇప్పుడు కూడా అలాగే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

పూర్తిగా ఆన్ లైన్ లోనే ఆయన దొరుకుతున్నారు. మహేష్ తో మాట్లాడుకున్నవాళ్ళు ఆన్ లైన్ లోనే కలిసి మాట్లాడతారు. పరిస్దితులు పూర్తి కంట్రోలు లోకి వచ్చేదాకా అదే సిట్యువేషన్ ని కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఇంటికి విజిటర్స్ ఎవరిని అనుమతించకుండా స్ట్రిక్ట్ గా ఇనస్ట్రక్షన్స్ ఇచ్చినట్లు సమాచారం. నిర్మాతలు, డైరక్టర్స్ ,వేరే ఎవరైనా సరై మహేష్ తో వీడియో కాల్స్ లోనే సంప్రదించాల్సి ఉంటుంది.

సర్కారువారి పాట రిలీజ్ వచ్చే సంవత్సరం కాబట్టి కంగారేం లేదు అని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తైంది. మిగతాది కరోనా కంట్రోలు లోకి వచ్చాక ఫినిష్ చేస్తారు. అప్పటిదాకా వెయిట్ చేద్దాం , హడావిడి వద్దు అని దర్శకుడు పరుశరామ్ కు మహేష్ బాబు క్లారిటీగా చెప్పినట్లు సమాచారం. దాంతో ఆయన ఫ్యామిలితో జాగ్రత్తగా ఉంటూ వీడియో కాల్స్ తో టీమ్ కు అందుబాటులో ఉంటున్నారు.