Begin typing your search above and press return to search.

శ్రీమంతుడు.. సైకిల్‌ తొక్కాడు, రై రై అన్నాడు

By:  Tupaki Desk   |   10 Aug 2015 2:10 PM GMT
శ్రీమంతుడు.. సైకిల్‌ తొక్కాడు, రై రై అన్నాడు
X
ఊర మాస్‌ డైలాగ్‌ చెప్పాలంటే ప్రిన్స్‌ మహేష్‌ తర్వాత. చూడనీకి క్లాస్‌ గా కనిపిస్తాడు కానీ, ఇన్‌ సైడ్‌ పక్కా మాస్‌. అతడు మాస్‌ కే బాస్‌. మసాలా ఐటెమ్‌ లను బాగా ఇష్టపడే హీరో అని అతడి సినిమాలే చెబుతాయి. ఆగడులో నైజాం యాస లో మాట్లాడుతూ మాస్‌ రాజా అనిపించాడు. అయితే శ్రీమంతుడు అనే క్టాస్‌ టైటిల్‌ పెట్టుకుని క్లాస్‌ టచప్‌ ఇస్తాడులే అనుకుంటే అక్కడక్కడా మాస్‌ బిట్స్‌ తో మెరుపులు మెరిపించాడు. ఈ ఫార్ములా పిల్లల్లో బాగా వర్కవుటైంది. ఇప్పుడు శ్రీమంతుడు థియేటర్లకు వస్తున్నవాళ్లలో స్కూలు పిల్లల శాతం ఎక్కువగా ఉంది.

ఈ సినిమాలో మహేష్‌ తన సొంతూరు దేవర కొండను వెతుక్కుంటూ ఆర్టీసీ బస్సులో వస్తుంటాడు. మధ్యలో రౌడీలు, ట్రాఫిక్కు న్యూసెన్స్‌. రౌడీల్ని చితక్కొట్టి ట్రాఫిక్‌ క్లియర్‌ చేసి బస్సు ఎక్కేశాక .. సడెన్‌ గా డోర్‌ దగ్గర నిలబడి రై రై అంటూ బస్సు డ్రైవర్‌ ని అలెర్ట్‌ చేస్తాడు. ఈ సీన్‌ బాగా వర్కవుటైంది. పల్లెటూళ్ల లో సిటీబస్‌ కండెక్టర్‌ లా మహేష్‌ పలికిన ఆ డైలాగ్‌ జిమ్మకు పట్టేసింది. ముఖ్యంగా పిల్లల ముఖంపై చిరునవ్వు మొలిపించిందీ డైలాగ్‌.

అంతేకాదు.. శ్రీమంతుడు అంతటివాడే అయినా ఓ సైకిల్‌ తొక్కుకుంటూ చాలా సాధాసీధాగా ఊళ్లో తిరిగేస్తుంటాడు. ఆ సైకిలింగ్‌ కూడా బాలలకు బాగా నచ్చేసింది. పట్నంలో పిల్లలు ఆటోల్లో, స్కూలు బస్సుల్లో స్కూలుకెళ్తారు కానీ, పల్లెల్లో సైకిల్‌ తొక్కుకునే స్కూలుకెళుతుంటారు. ఆ రకంగా మహేష్‌ బాగా కనెక్టయిపోవడంలో కొరటాల మాష్టర్‌ ప్లాన్‌ వర్కవుటైంది. అందుకే ఈ వసూళ్లన్నమాట.