Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌.. మహేష్ ఎపిసోడ్ లో పవన్ కూడా..!

By:  Tupaki Desk   |   24 Nov 2021 5:39 AM GMT
ఎన్టీఆర్‌.. మహేష్ ఎపిసోడ్ లో పవన్ కూడా..!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా జెమిని టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు షో టెలికాస్ట్‌ అవుతున్న విషయం తెల్సిందే. ఈ సీజన్ ముగింపు దశకు వచ్చింది. ఎప్పుడో రెండు మూడు నెలల క్రితం షూట్ చేసి పెట్టిన మహేష్ బాబు స్పెషల్‌ గెస్ట్‌ ఎపిసోడ్‌ ను ఊరిస్తూ వస్తున్నారు. దసరా.. దీపావళి అంటూ ఎట్టకేలకు రాబోయే వారంలో టెలికాస్ట్‌ చేసేందుకు సిద్దం అయ్యారు. తాజాగా ప్రోమోను విడుదల చేశారు. మహేష్ అన్నా అంటూ ఎన్టీఆర్‌ పిలిచిన తీరుతో ఇద్దరు అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ షో ను స్ట్రీమింగ్‌ చేస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ షో స్థాయిని అమాంతం పెంచేసింది. అదే ఈ ఎపిసోడ్ లో పవన్ కూడా కనిపించబోతున్నాడు అనేది ఆ వార్త.

మహేష్‌ బాబు స్పెషల్‌ గెస్ట్ గా హాజరు అయ్యి ఎన్టీఆర్ తో గేమ్‌ ఆడుతున్న సమయంలో ఒక ప్రశ్నకు వీడియో కాల్‌ ఫ్రెండ్‌ హెల్ఫ్‌ తీసుకుంటాడు. మహేష్ బాబు వీడియో కాల్‌ స్నేహితుడిగా పవన్ కళ్యాణ్ ను ఎంపిక చేసుకోవడం జరిగిందట. దాంతో ఎన్టీఆర్ తన షో లో పవన్‌ కళ్యాణ్ కు కాల్ కలపడం మహేష్ బాబు మరియు ఎన్టీఆర్ లతో పవన్ కళ్యాణ్‌ మాట్లాడటం ఆ ఎపిసోడ్‌ లో చూడబోతున్నట్లుగా చెబుతున్నారు. చరణ్‌ మరియు ఎన్టీఆర్ ల కర్టన్ రైజ్‌ ఎపిసోడ్‌ ను రెండు రోజులు టెలికాస్ట్‌ చేయడం జరిగింది. ఆ రెండు రోజులు కూడా భారీ ఎత్తున టీఆర్పీ రేటింగ్‌ దక్కిన విషయం తెల్సిందే. అందుకే మహేష్‌ బాబు ఎపిసోడ్ ను కూడా రెండు ఎపిసోడ్‌ లు గా టెలికాస్ట్‌ చేయాలని అభిమానులు మరియు బుల్లి తెర ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న ఈ ఎవరు మీలో కోటీశ్వరులు షో కు ఆశించిన స్థాయిలో రేటింగ్‌ రావడం లేదు. అయితే స్పెషల్‌ గెస్ట్‌ లు వచ్చినప్పుడు మాత్రం రికార్డు స్థాయి రేటింగ్‌ ను నమోదు చేస్తుంది. అలా ఎన్టీఆర్‌.. మహేష్‌ బాబు ఎపిసోడ్ కూడా ఖచ్చితంగా మరో రేంజ్ లో ఉండబోతుంది కనుక ఖచ్చితంగా భారీ రేటింగ్ దక్కుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ ఎప్పటికి నిలిచి పోయేలా ఉంటుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కొన్ని నిమిషాల పాటు కనిపించడం వల్ల ఆ ఎపిసోడ్ స్థాయే మారిపోతుంది. ఈ ముగ్గురిని సింగిల్ స్క్రీన్‌ లో ఒకే సారి చూడాలని చాలా కాలంగా అభిమానులు కోరుకుంటున్నారు. అది జెమిని టీవీ వేదికగా త్వరలో నెరవేరబోతుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.