Begin typing your search above and press return to search.
#RRR: మహేష్ బాబు టచ్ ఉందట!
By: Tupaki Desk | 11 Aug 2018 1:35 PM GMTప్రకటన రాక ముందు నుంచే వేచి చూడడం ఒక్క రాజమౌళి సినిమా విషయం లోనే జరుగుతుందేమో. 'బాహుబలి-2' రిలీజ్ అయిన తర్వాత ఎంతో కాలం వేచి చూసిన తర్వాత రామ్ చరణ్ - ఎన్టీఆర్ ల తో ఓ ఫోటో దిగి దాన్ని ట్విట్టర్ లో పెట్టగానే రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ లో హీరోలు ఎవరనే విషయం అందరికీ అర్థం అయింది. ఆ తర్వాత #RRR మోషన్ పోస్టర్ తో తన సినిమాను అధికారికంగా ప్రకటించాడు రాజమౌళి.
తాజాగా ఈ ప్రాజెక్టు కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఫిలిం నగర్లో ప్రచారంలో ఉంది. అదేంటంటే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో పాటుగా సూపర్ స్టార్ మహేష్ బాబు టచ్ కూడా ఉంటుందట. అలా అని మహేష్ క్యామియో అని మీరు తొందరపడి ఫిక్స్ కావద్దు. ఈ సినిమాకు మహేష్ తో వాయిస్ ఓవర్ చెప్పించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. ఒక వేళ అది నిజమే అయితే మహేష్ ఆ ప్రపోజల్ తిరస్కరించే అవకాశం తక్కువ. ఎందుకంటే మహేష్ కు చరణ్ చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎన్టీఆర్ తో కూడా మంచి రిలేషన్ ఉంది. పైగా రాజమౌళి #RRR తర్వాత మహేష్ తో వర్క్ చేస్తాడనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటప్పుడు రాజమౌళి అడిగితే మహేష్ కాదనే అవకాశమే లేదు.
అసలే చరణ్ - ఎన్టీఆర్ మల్టిస్టారర్.. పైగా రాజమౌళి డైరెక్టర్.. దీనికే ప్రేక్షకులు ఉబ్బితబ్బిబ్బవుతుంటే ఇక సూపర్ స్టార్ మహేష్ వాయిస్ ఓవర్ కూడానా? దీంతో ఈ ప్రాజెక్ట్ కు మరింత స్పెషల్ గా మారడం ఖాయం.