Begin typing your search above and press return to search.

మహేష్‌ భరత్ వర్సెస్ బన్నీ సూర్య

By:  Tupaki Desk   |   24 May 2017 5:30 AM GMT
మహేష్‌ భరత్ వర్సెస్ బన్నీ సూర్య
X
టాలీవుడ్ ఇప్పుడు రెండు బడా ప్రాజెక్టుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మురుదగాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న డీజే చిత్రాలు.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయనే అంచనాలున్నాయి. జూన్ 23న దువ్వాడ జగన్నాథం విడుదల కానుందని క్లారిటీ ఉండగా.. మహేష్ సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా ఏమీ తేలలేదు.

అయితే.. తమ మరుసటి చిత్రాలను జూన్ లోనే ప్రారంభించేయనున్నారు సూపర్ స్టార్.. స్టైలిష్ స్టార్. కొరటాల శివతో 'భరత్ అను నేను' అంటూ మహేష్ బాబు మూవీ చేయనుండగా.. వక్కంతం వంశీ డైరెక్షన్ లో 'నా పేరు సూర్య' అంటూ బన్నీ మూవీ ప్రారంభం కానుంది. ఇప్పటికే తమ చిత్ర షెడ్యూల్ పై పక్కాగా ఉన్నాడు కొరటాల శివ. వచ్చే ఏడాది జనవరి 11కు మహేష్ మూవీని రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పాడు. అందుకు తగ్గట్లుగానే ప్లాన్ చేసుకుంటున్నాడు కూడా.

మరోవైపు బన్నీ సినిమాను కూడా సంక్రాంతి బరిలోనే నిలపాలని భావిస్తున్నాడు వక్కంతం వంశీ. ఆ సీజన్ మిస్ అయితే.. మళ్లీ సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే.. దాదాపుగా ఒక సినిమాకు ఏడాది పట్టేస్తుంది. అందుకే సంక్రాంతినే టార్గెట్ చేస్తున్నారు మహేష్ అండ్ బన్నీ. భరత్ గా మహేష్ బాబు.. సూర్యగా అల్లు అర్జున్.. ఇద్దరూ కలిసి పొంగల్ కి పోటీ పడనున్నారన్నది టాలీవుడ్ లేటెస్ట్ టాక్.