Begin typing your search above and press return to search.
మహేశ్, అల్లు అర్జున్..అనవసర పోటీతో ప్రశాంతత లేకుండా!
By: Tupaki Desk | 28 Jan 2020 9:48 AM GMTసంక్రాంతి సందర్భం గా విడుదల అయిన రెండు ప్రముఖ సినిమాలూ బాక్సాఫీస్ వద్ద హిట్టే.. అనేది ట్రేడ్ విశ్లేషకులు మాట. ఈ రెండు సినిమాలూ చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్, ఈ రెండు సినిమాలూ ప్రాంతాల వారీగా సాధించిన వసూళ్లు.. ఈ రెండింటినీ బేరీజు వేసుకుని చూస్తే.. ఈ రెండు సినిమాలూ కమర్షియల్ గా హిట్ అయినట్టే లెక్క అని వారు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలను భారీ బడ్జెట్ తో రూపొందించారు. హీరోల పారితోషకం అదే స్థాయిలో ఉంది. అయినప్పటికీ సంక్రాంతి సమయంలో తెలుగువారు సినిమాల పట్ల విపరీత ఆదరణ చూపించారు. దీంతో ఈ రెండు సినిమాలూ భారీ ఎత్తున వసూళ్లను సాధించాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఇలా సంక్రాంతి చాంఫియన్లు గా ఈ రెండు సినిమాలూ నిలుస్తూ ఉన్నాయి. ఏదానికి ఆదాన్ని చూసుకుంటే.. ఈ రెండు సినిమాలూ హిట్టే! అక్కడి వరకూ ఆల్ హ్యాపీస్. అయితే ఈ సినిమాల రూపకర్తలు ఒక దానితో మరొకటి పోల్చుకుని కలెక్షన్ల విషయంలో అనవసరమైన పోటీ తో.. ప్రశాంతత లేకుండా చేసుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు.
సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురంలో.. ఈ రెండు సినిమాల మధ్యన ఏ స్థాయిలో పోటీ తలెత్తిందో వేరే చెప్పనక్కర్లేదు. విడుదల తేదీ దగ్గర నుంచి వీటి మధ్య పోటీ తలెత్తింది. ఆ తర్వాత ఈ రెండు సినిమా లూ విడుదల అయ్యాకా ఆ పోటీ తీవ్రం అయ్యింది. పోటాపోటీ ప్రకటనలు చేసుకుంటూ వచ్చారు. ఒకరేమో రెండో రోజే సంక్రాంతి విన్నర్ అని ప్రకటించుకుంటే, రెండో వారు రియల్ సంక్రాంతి విన్నర్ అంటూ కౌంటర్ ప్రకటన ఇచ్చారు!
ఆ తర్వాత వసూళ్ల నంబర్ ను ప్రకటించుకోవడంలో కూడా ఈ రెండు సినిమాల వాళ్లూ పోటీ పడ్డారు. తమ సినిమా ఎక్కువ వసూళ్లు సాధించింది అంటే, తమ సినిమా ఎక్కువ వసూళ్లు సాధించిందని ప్రకటించుకుంటున్నారు. ఇలా వీరి పోటీ ప్రకటనలు కొనసాగుతూ ఉన్నాయి. పనిలో పనిగా బాహుబలి పార్ట్ వన్ వసూళ్ల నంబర్ ను దాటేసినట్టుగా కూడా వీరు ప్రకటించుకుంటూ ఉన్నారు. సినిమాలు విడుదలై పోయి పక్షం రోజులు దాటినా వీరి ప్రకటనల జోరు మాత్రం కొనసాగుతూ ఉంది. ఇదంతా అనవసరమైన రచ్చ అని పరిశీలకులు అంటున్నారు.
ఏ సినిమా కు ఆ సినిమాగా చూసుకుంటే.. ఈ రెండు సినిమాలూ హిట్టే అని, అయితే అనవసరమైన పోటీకి వెళ్లి...వీరిద్దరూ ప్రశాంతతను చెడగొట్టుకుంటున్నారని, ప్రేక్షకులను కూడా వీరి ప్రకటనలతో విసిగిస్తున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.