Begin typing your search above and press return to search.
మహేష్ బాబు vs పవన్ కళ్యాణ్
By: Tupaki Desk | 1 March 2021 8:40 AM GMTటాలీవుడ్ లో ఎన్ని సీజన్లు వచ్చినా సంక్రాంతి పండుగ సీజన్ ఇచ్చే కిక్ వేరని చెప్పాలి. 2021 సంక్రాంతి వార్ లో స్టార్ హీరోల సినిమాలు లేనప్పటికీ వచ్చే ఏడాది సంక్రాంతి మాత్రం చాలా రసవత్తంగా మారనుంది. ఎందుకంటే స్టార్ డమ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ లో పోటాపోటీగా నిలిచే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరూ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. మహేష్ - డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' చిత్రాన్ని 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించగా.. ఇప్పుడు క్రిష్ - పవన్ కాంబోలో వస్తున్న పీరియాడికల్ మూవీని అదే సీజన్ లో తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో మహేష్ - పవన్ సినిమాల మధ్య పోటీ వారి ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధానికి దారి తీయడంతో పాటు.. రెండు సినిమాలకు భారీ ఓపెనింగ్స్ తీసుకువచ్చే అవకాశం ఉంది. నిజానికి ఇప్పటి వరకు ఈ ఇద్దరు స్టార్ హీరోలు నాలుగు సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడినప్పటికీ ఒకేసారి ఎప్పుడూ ఫైట్ చేయలేదు. కొన్ని రోజుల గ్యాప్ లో ఇద్దరి సినిమాలు విడుదల అయ్యాయి. 1999లో మహేష్ డెబ్యూ మూవీ 'రాజకుమారుడు' - పవన్ 'తమ్ముడు' సినిమాలు రెండు వారాల తేడాతో విడుదలై సక్సెస్ అయ్యాయి. ఇక 2000లో మహేష్ 'యువరాజు' - పవన్ 'బద్రి' సినిమాలు వారం గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 2004లో మూడు వారాల గ్యాప్ లో మహేష్ 'అర్జున్' - పవన్ 'గుడుంబా శంకర్' సినిమాలు విడుదల అయ్యాయి. అలానే 2006 ఏప్రిల్ 28న మహేష్ బాబు నటించిన 'పోకిరి' విడుదలైతే.. మే 3న పవన్ 'బంగారం' వచ్చింది.
ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ బరిలో పవన్ సినిమా వర్సెస్ మహేష్ సినిమాని చూడబోతున్నారు. కాకపోతే మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా అనుకున్న తేదీకి వచ్చే అవకాశాలున్నాయి కానీ.. #PSPK27 సినిమా వచ్చే అవకాశాలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయని ఫిలిం సర్కిల్స్ లో డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే గతేడాది ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. మరోవైపు పవన్ అర డజను సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. ఒకవేళ క్రిష్ సినిమా షూటింగ్ అప్పటికి పూర్తయినా దీనికి గ్రాఫిక్స్ వర్క్ చేయడానికి చాలా సమయం కావాలి. అంతేకాకుండా ఈ చిత్రానికి ఫైనాన్స్ కష్టాలు ఉన్నాయనే టాక్ ఉంది. ఇవన్ని దాటుకుని అన్నీ సక్రమంగా జరిగితే 2022 సంక్రాంతికి పవన్ మరియు మహేశ్ బాక్సాఫీర్ వార్ కన్ఫమ్ అయినట్లేనని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.