Begin typing your search above and press return to search.

అప్పుడే పండుగాడేంటండీ? - మహేష్‌

By:  Tupaki Desk   |   7 Aug 2015 3:56 PM GMT
అప్పుడే పండుగాడేంటండీ? - మహేష్‌
X
ఈ ఆదివారం ప్రిన్స్‌ మహేష్‌ జన్మదినం. ఈ సందర్భంగా అతడి ఫ్యామిలీ లైఫ్‌ గురించి? పిల్లలతో వ్యవహారం గురించి ఓ మాటేస్తే ఎలా ఉంటుంది? చాలా బావుంటుంది కదూ? అలా మాటేసినప్పుడు సితార 1గురించి మహేష్‌ ఏమన్నారంటే.. సితార చాలా డిమాండింగ్‌. స్కూల్‌ నుంచి రాగానే అందరి ఫోకస్‌ తనమీదే ఉండాలి. పక్కవారితో మాట్లాడితే అస్సలు ఒప్పుకోదు. ఫోన్‌ లో మాట్లాడినా ఊరుకోదు. ఫోన్లు విసిరి కొడుతుంటుంది. టైమ్‌ అంతా సితారకే ఇవ్వాలి. కానీ అదంతా నాకు హ్యాపీగా అనిపిస్తుంది. తాను భోజనం చేస్తున్నప్పుడు నా పాటలే పెట్టాలి. పాట మొత్తం పాడేస్తుంటుంది. డ్యాన్స్‌ చేస్తుంటుంది. సితారని చూస్తుంటే మా అమ్మమ్మగారు గుర్తొస్తుంటారు. అంటూ డీటెయిల్స్‌ లో కెళ్లిపోయాడు ప్రిన్స్‌.

ఇక గౌతమ్‌ గురించి ప్రస్థావిస్తే ,... పండుగాడి డైలాగ్‌ గౌతమ్‌ తో చెప్పించారు. పోకిరి గౌతమ్‌ తో రీమేక్‌ చేయించే ఆలోచన ఏమైనా ఉందా? అని ప్రశ్నిస్తే.. గౌతమ్‌ చిన్న పిల్లాడండీ. అప్పుడే మీరు పోకిరి వరకూ తీసుకెళ్లారు. నాన్నగారి పుట్టినరోజున సరదాగా గౌతమ్‌ తో ఏడైనా చేయించాలనిపించింది. అప్పుడే పండుగాడు డైలాగ్‌ గుర్తు కొచ్చింది. ఆ డైలాగ్‌ ని డబ్‌ స్మాష్‌ లో గౌతమ్‌ తో చెప్పించి ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌ లో పెట్టా. మంచి స్పందన వచ్చింది. అభిమానులు హ్యాపీ... అని చెప్పుకొచ్చారు. నాకు పనుందని తప్పించుకోవాలని చూసినా గౌతమ్‌ వదిలిపెట్టకుండా స్కూలుకి తీసుకెళ్తుంటాడు గౌతమ్‌. అంతేకాదు ఐమాక్స్‌ కి వెళ్లి సినిమాలు చూసొస్తుంటాడు తను. అంతేకాదు గౌతమ్‌, సితార ఇద్దరూ నాన్న(కృష్న)తో చాలా సరదాగా ఆడుకుంటారు.