Begin typing your search above and press return to search.

కియరాని వదలనంటున్న సూపర్ స్టార్..!

By:  Tupaki Desk   |   15 April 2020 2:00 PM GMT
కియరాని వదలనంటున్న సూపర్ స్టార్..!
X
ఈ సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరూ' అంటూ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ తన నెక్స్ట్ సినిమాతో అదే రేంజ్ లో సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రానికి 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. పరశురామ్ తో మహేష్ సినిమా చేస్తున్నట్లు ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ దాదాపు అతనితోనే మహేష్ తన 27వ ప్రాజెక్టును పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే డైరెక్టర్ ఎవరనేది ఇంకా ఫైనల్ అనౌన్స్ మెంట్ రాకముందే ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం ఆ బాలీవుడ్ బ్యూటీ ఉండాలని అబ్లిగేష‌న్ మాత్రం ఉందంట.

వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు కెరీర్ లో 27వ చిత్రంగా తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీని తీసుకోవాలని అనుకుంటున్నారట. దీనికి కారణం మహేష్ బాబు సతీమణి నమ్రత అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. డైరెక్టర్ ఎవరైనా సరే మహేష్ నెక్స్ట్ మూవీలో ఖచ్చితంగా కియారనే ఉండాలని నమ్రత పట్టుబడుతుందట. కియారాని నమ్రత రిక‌మెండ్ వెనక కారణం లేకపోలేదు. అదేంటంటే.. మ‌హేశ్ త‌న నెక్ట్స్ మూవీని పాన్ ఇండియా వైడ్ ప్లాన్ చేస్తున్నాడట. దీంతో బాలీవుడ్ మార్కెట్ పరంగా చూసుకుంటే కియారా అద్వానీ యూజ్ అవుతుంద‌ని నమ్రత అండ్ టీమ్ భావిస్తున్న‌ట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇప్పటికే బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతూ వరుస పెట్టి అవకాశాలను దక్కించుకుంటున్న కియారా అయితే సినిమాకి ఇంకా ప్లస్ అవుతుందని మహేష్ బాబు కూడా భావిస్తున్నాడట. వాస్తవానికి కియారా అద్వానీని తెలుగు తెరకు పరిచయం చేసింది కూడా సూపర్ స్టారే. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'భ‌ర‌త్ అనే నేను' సినిమాలో వీరిద్దరూ కలిసి రొమాన్స్ చేసారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు మహేష్ బాబు కెరీర్లో అప్పటికి హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మహేష్ - కియారా జంట స్క్రీన్ మీద మళ్ళీ కనిపిస్తే రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమని అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి కియారా ఈ సినిమా ఓకే చేసి నమ్రత అండ్ టీమ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తుందేమో చూడాలి.

ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మే నెల ఎండింగ్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే 31 అంటే మహేష్ బాబుకు చాలా సెంటిమెంట్. ఎందుకంటే అదే రోజు తన తండ్రి సూపర్ స్టాట్ కృష్ణ పుట్టినరోజు. ఆ రోజున తన ప్రతి సినిమాకు సంబంధించిన ఎదో ఒక అప్ డేట్ ని ఇవ్వడం మహేష్ కి సెంటిమెంటుగా వస్తోంది. దీంతో మహేష్ బాబు కొత్త సినిమాకు సంబంధించిన పనులను ఆ రోజు మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యాడట. కరోనా పరిస్థితులు అనుకూలిస్తే జెట్ స్పీడ్ లో షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో దించే అవకాశాలున్నాయని సమాచారం.